TSPSC: యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ చుట్టూ తిరుగుతున్న విచారణ.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఇన్వెస్టిగేషన్లో సిట్ దూకుడు..
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ చుట్టూ సిట్ దర్యాప్తు మొదలు పెట్టింది. రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ ఎలా కొట్టేశారనేదే మిస్టరీగా మారింది. CD ఇంచార్జ్ శంకర్‌లక్ష్మీ డైరీ నుంచి కొట్టేశామన్నారు నిందితులు. అయితే, నిందితులు చెప్పేది అబద్ధమని..
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఇన్వెస్టిగేషన్లో సిట్ దూకుడు పెంచింది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ చుట్టూ సిట్ దర్యాప్తు మొదలు పెట్టింది. రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ ఎలా కొట్టేశారనేదే మిస్టరీగా మారింది. CD ఇంచార్జ్ శంకర్‌లక్ష్మీ డైరీ నుంచి కొట్టేశామన్నారు నిందితులు. అయితే, నిందితులు చెప్పేది అబద్ధమని సిట్ అంటోంది. ఐడీ, పాస్ వర్డ్ గురించి సరైన సమాధానం చెప్పకపోవడంతో రాజశేఖర్, ప్రవీణ్‌ను విడి విడిగా విచారించినట్లుగా సమాచారం. మరో నిందితురాలు రేణుక కోసమే ప్రవీణ్ ఏఈ పేపర్ లీక్ చేసాడనేది అబద్ధమంటోంది సిట్. అక్టోబర్ నుంచి జరిగిన అన్ని పేపర్స్ లీక్ అయినట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. బంధువులు, స్నేహితుల్లో పోటీ పరీక్షలు రాసే వారికోసం ప్రవీణ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. డబ్బులు ఇస్తే.. పేపర్ లీక్ చేస్తానని అభ్యర్థులతో ప్రవీణ్ మాట్లాడినట్లుగా సిట్ డౌట్ వ్యక్తం చేస్తోంది. అదే కోణంలో విచారణ చేస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ ఇంట్లో సోమవారం సిట్ సోదాలు చేసింది. పేపర్లకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.
ఇదిలావుంటే, పేపర్ లీక్ నిందితులు రేణుక, భర్త డాక్యానాయక్ ఉద్యోగాలు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం బుద్ధారంలోని బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా రేణుక పని చేస్తున్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రాస్‌కి నివేదిక పంపిన స్కూల్ ప్రిన్సిపాల్ పంపించారు. ఈ నివేదిక ఆధారంగా రేణుకని సస్పెండ్ చేస్తూ రోనాల్డ్‌రాస్ ఉత్తర్వులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపిడిఓ ఆఫీస్‌లో ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రేణుక భర్తను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా ఉగాది పండుగ రోజే విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. పేపర్ లీక్ కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలు ఇవ్వాలంటూ రేవంత్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే తనతో పాటు మంత్రి కేటీఆర్‌కు నోటీసులిస్తే..తన దగ్గరున్న ఆధారాలు ఇస్తానంటున్నారు రేవంత్ రెడ్డి. మరి షడ్రుచుల పండుగ రోజు..టీఎస్‌పీఎస్‌సీ ఎపిసోడ్ ఎంత హీటెక్కిస్తుందో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం