Watch: హాస్టల్‌లో అక్కలు.. నో ఎంట్రీ అన్న వార్డెన్.. రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు చేసిన సహసం.. వీడియో వైరల్

ప్రపంచవ్యాప్తంగా రక్షాబంధన్ సందడి నెలకొంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, ప్రేమాప్యాయతలకు ప్రతీకగా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.. సోదరులపై ప్రేమతో సోదరి వారికి రాఖీ కడుతుంది.. అయితే.. ఓ హాస్టల్ వార్డెన్ నిర్వాకంతో అక్కలు తమ్ముడికి రాఖీ కట్టలేకపోయారు..

Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 19, 2024 | 7:01 PM

ప్రపంచవ్యాప్తంగా రక్షాబంధన్ సందడి నెలకొంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, ప్రేమాప్యాయతలకు ప్రతీకగా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.. సోదరులపై ప్రేమతో సోదరి వారికి రాఖీ కడుతుంది.. అయితే.. ఓ హాస్టల్ వార్డెన్ నిర్వాకంతో అక్కలు తమ్ముడికి రాఖీ కట్టలేకపోయారు.. రక్షాబంధన్ వేళ ఆంక్షలు, వార్డెన్ అనుమతించకపోవడంతో.. రాఖీ ఎలా కట్టాలని అక్కలు తీవ్ర ఆవేదన చెందారు.. ఈ క్రమంలోనే.. తమ్ముడు సహసం చేసి మరి రాఖీ కట్టించుకున్నాడు.. తండ్రి భుజాల పైకెక్కి తమ్ముడు నిల్చోవడంతో.. అక్కలు హాస్టల్ రూమ్ కిటికీలోంచి ఒకరి తర్వాత ఒకరు రాఖీలు కట్టారు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఈ ఘటన తెలంగాణ మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం జరిగింది.

రక్షాబంధన్ వేళ రామకృష్ణాపూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల హస్టల్ లోకి విద్యార్థినుల కుటుంబసభ్యులను హాస్టల్ వార్డెన్ అనుమతించలేదు.. సెలవు లేదంటూ విద్యార్థినులను కూడా బయటకు పంపించలేదు.. దీంతో తమ్ముడు జితేంద్రకు హస్టల్ రూం నుంచే దాసరి ఆశ్విక, సహస్రలు రాఖీలు కట్టారు.. తండ్రి భుజాలపై ఎక్కి తమ్ముడు నిల్చోగా.. తమ సోదరుడికి విద్యార్థినులు రాఖీలు కట్టారు.. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

కాగా.. రాఖీ పండుగ వేళ హాస్టల్ లో ఆంక్షలపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కనీసం రాఖీ కట్టేందుకు అయినా అనుమతించాల్సిందని.. వార్డెన్ ఇలా చేయడం బాగాలేదంటూ ఫైర్ అవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..