AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిరిసిల్ల నేతన్న చేతిలో మువ్వన్నెల జెండా రెప..రెపలు..ఇక్కడి నుంచి రాష్ట్రాలకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ జెండాలు

దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల నుంచి సిరిసిల్లకు ఆర్డర్లు వచ్చాయి. దీంతో జెండాలు తయారుచేసే వ్యాపారులు బిజీగా మారా రు. ఇక్కడి పది మంది వ్యాపారులకు 10 లక్షల జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయి. వీటి ద్వారా 500 మంది మహిళలు పైగా జెండాలు కుడుతూ ఉపాధి పొందుతున్నారు.

సిరిసిల్ల నేతన్న చేతిలో మువ్వన్నెల జెండా రెప..రెపలు..ఇక్కడి నుంచి రాష్ట్రాలకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ జెండాలు
Har Ghar Tiranga
G Sampath Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Aug 14, 2024 | 4:21 PM

Share

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు వేడు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధ మైంది. ఇందులో భాగంగా ఈ నెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రణాళికలు చేసింది.  కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వ శాఖలకు అదే శాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకలకు అవసరమైన జెండాల్లో 60శాతం పైగా రాజన్న సిరిసిల్ల కేంద్రంలో తయారు చేయడం విశేషం. వీటి తయారీకి ఉపయోగించే తెలుపు రంగు పాలిస్టర్ వస్త్రాన్ని సిరిసిల్ల మరమగ్గాలపై ఉత్పత్తి చేశారు. ఈ వస్త్రాన్ని గుత్తేదారులు కొను గోలు చేసి, హైదరాబాద్ లోని అవసరం మేరకు డైయింగ్ యూనిట్లకు పంపించి రంగులు అద్దిస్తారు. అక్కడి నుంచి తిరిగి సిరిసిల్లకు వచ్చాక ఇక్కడ పట్టణంలోని మహిళలు వాటిని సైజుల ప్రకారం కత్తిరించి, కుట్టి తిరిగి హోల్ సేల్  గా అమ్మే వారికి అప్పగిస్తున్నారు. ఈ పనిని ఒక్కొక్క పిసు ధర కూలీ కట్టి మహిళలకు ఇస్తారు.

కార్ఖానాలో సిద్ధమైన జెండాలు

ఇంట్లోనే ఈ జెండాలను సిద్ధం చేస్తున్నారు. పట్టణంలో వీటిపై ఆధారపడి సుమారు వెయ్యి మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఢిల్లీ, చెన్నైల నుంచి ఇక్కడి వ్యాపారులకు ఆర్డర్లు వచ్చాయి. వీటితో నెల రోజులుగా పట్టణంలోని చాలా కాలనీల్లో ప్రతి ఇంటా  జెండాలు తయారీ కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల నుంచి సిరిసిల్లకు ఆర్డర్లు వచ్చాయి. దీంతో జెండాలు తయారుచేసే వ్యాపారులు బిజీగా మారా రు. ఇక్కడి పది మంది వ్యాపారులకు 10 లక్షల జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయి. వీటి ద్వారా 500 మంది మహిళలు పైగా జెండాలు కుడుతూ ఉపాధి పొందుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..