AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddipet Municipal Elections: మున్సిపల్ ఎన్నికల వైపు కన్నేత్తి చూడని కాంగ్రెస్ నేతలు.. ఆయోమయంలో ఆ పార్టీ అభ్యర్థులు..!

సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ నేతలు లైట్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతల జాడే కనిపించడంలేదు. దీంతో ఆ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులు మాత్రం అయోమయనికి గురి అవుతున్నారు..

Siddipet Municipal Elections: మున్సిపల్ ఎన్నికల వైపు కన్నేత్తి చూడని కాంగ్రెస్ నేతలు.. ఆయోమయంలో ఆ పార్టీ అభ్యర్థులు..!
Congress Party
Balaraju Goud
|

Updated on: Apr 25, 2021 | 1:34 PM

Share

Siddipet Municipal Elections: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం జోరుగా సాగుతోంది.. ప్రధాన పార్టీల నాయకులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి శాయశక్తుల కష్టపడుతున్నారు. వార్డుల్లో తిరుగుతూ భరోసా కల్పిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతల జాడే కనిపించడంలేదు. దీంతో ఆ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులు మాత్రం అయోమయనికి గురి అవుతున్నారు.. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ నేతలు చాలా లైట్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది

సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి పార్టీలు.. కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద్దిపేట మునిసిపల్ ఎన్నికల పై పెద్దగా దృష్టి సారించినట్లుగా కనిపించడం లేదు.. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి నేటి వరకు ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క సీనియర్ నేత అటు వైపే చూడటంలేదు. కనీసం ఇక్కడ బరిలో ఉన్నవారి పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసింది లేదు.. ఓవైపు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకు పోతుంటే కాంగ్రెస్స్ పార్టీ మాత్రం ప్రచారంలో చాలా వెనుకబడింది. అసలు కాంగ్రెస్ పార్టీ తరపున ఎందుకు పోటీ చేస్తున్నామో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు పోటీ చేస్తున్న అభ్యర్థులు..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉదాసీనంగానే వ్యవహరించింది.. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించి, ప్రచారంలోకి దూసుకుపోతున్న చివరి నిమిషంలో హడావుడిగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. సిద్దిపేటలో మొత్తం 43 వార్డులు ఉండగా వీటిలో 31 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. వీరి విధానాలు సరిగ్గా లేవని, ఆపార్టీ తరుపున బీఫామ్ తీసుకున్న ఓ అభ్యర్థి ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయాడు. రాష్ట్ర నేతల విషయం పక్కన పెడితే కనీసం జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి కూడా అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం లేదంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు…

ఇలా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల పై కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఆ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.. టీఆర్ఎస్ పార్టీ నుండి మంత్రి హరీష్ రావు.. బీజేపీ పార్టీ నుండి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆయా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రం ఏ ఒక్క నాయకుడు కూడా ఇటు వైపు చూడడం లేదు.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఒక్కసారి సీనియర్ నాయకుడు విహెచ్ ఒక్కసారి ప్రెస్ మీట్ నిర్వహించి వెళ్లిపోయాడు… మరో వైపు మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాంగ్రెస్ నేతల తీరు మున్సిపల్ ఎన్నికల్లో భారీగానే ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..