Rebbena SI : కీచక ఎస్సైపై ఉన్నతాధికారుల చర్యలు.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సై భార్య
ఎస్సై ప్రవర్తనతో ఆందోళన చెందిన యువతి సమీప బంధువులకు చెప్పడంతో వాళ్లు ఎస్సై పై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్సైని వీఆర్ కు అటాచ్ చేశారు.
Rebbena SI : కొమురం భీం జిల్లాలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెబ్బెన ఎస్సై భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన భర్తపై యువతి ఫిర్యాదు చేయడం, ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకోవడంతో మనస్తాపం చెందిన ఆ ఇల్లాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో వున్న శానిటైజర్ తాగింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్పీ. రెబ్బెన ఎస్సై భవానీ సేన్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే బాధిత యువతి స్టేట్ మెంట్ రికార్డు చేశారు పోలీసులు.
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో యువతిపై ఎస్ఐ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెబ్బెన ఎస్సై భవానీ సేన్ పోలీసు ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎస్సై భవాని సేన్ యువతికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు పిలిపించి, పుస్తకాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేలా చేస్తామని మాయమాటలు చెప్పి, అసభ్యంగా ప్రవర్తించారని యువతి ఆరోపించింది. ఎస్సై ప్రవర్తనతో ఆందోళన చెందిన యువతి సమీప బంధువులకు చెప్పడంతో వాళ్లు ఎస్సై పై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్సైని వీఆర్ కు అటాచ్ చేశారు. గతంలో కూడా WPC లతో ఎస్సై ఇలాగే ప్రవర్తించేవారని ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి