Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గ్రామ సింహంతో జతకట్టిన మృగరాజు.. వైరలవుతున్న వీడియో చూస్తేగానీ నమ్మలేరు ఇద్దరు మిత్రుల కథ..!

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో భిన్నంగా ఉంది. ఎందుకంటే తెల్ల సింహం, కుక్క ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. ఒకదాని ముఖం

Viral Video:  గ్రామ సింహంతో జతకట్టిన మృగరాజు.. వైరలవుతున్న వీడియో చూస్తేగానీ నమ్మలేరు ఇద్దరు మిత్రుల కథ..!
Friendship
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 12, 2022 | 2:53 PM

Viral Video Today: ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలను మనం ఇంటర్నెట్ లో చూస్తాం. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే… మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. తాజాగా సింహాం, గ్రామానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చూడటానికి చాలా క్యూట్ గా ఉంది ఈ వీడియో. సాధారణంగా సింహం అంటే అడవికి రాజు. అందుకేనేమో సింహాన్ని దూరం నుండి చూడాలన్నా చాలామంది భయపడుతూ ఉంటారు. అడవి రాజు అడవిలో షికారుకి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న జంతువులన్నీ తమ దారిని మార్చుకుంటాయి. కానీ అడవి రాజుతో స్నేహం ఎలా ఉంటుందో ఎవరీకి తెలియదు. కానీ సింహం స్నేహితుడు కుక్క కావచ్చని మీరు ఎప్పుడైనా ఊహించగలరా…. అది అసాధ్యం అనుకుంటారు కదా.? కానీ, ఇక్కడ అదే జరిగింది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

కుక్క గర్జన సింహగర్జనను అణచివేయదు, కుక్క సింహానికి మిత్రుడు కాదనే సామెత ఉంది. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో భిన్నంగా ఉంది. ఎందుకంటే తెల్ల సింహం, కుక్క ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. ఒకదాని ముఖం ఒకటి అప్యాయంగా చూసుకుంటున్నాయి. ఆ సింహం కూడా కుక్కను చూసి అస్సలు కోపం తెచ్చుకోదు. వీడియోలో కుక్క చుట్టూ సింహం తిరుగుతుంది. కుక్క సింహాన్ని చూసి హస్యం చేస్తుంది. దాన్ని చూసి బిగ్గరగా అరుస్తుంది. దాంతో ఆ సింహం ఇక కుక్కపై ఎటాక్‌ చేస్తుందని అంతా అనుకుంటారు..కానీ, ఆ సింహం కుక్కకు తన షేక్‌ హ్యండ్‌ ఇచ్చినట్టుగా పంజాతో తట్టింది. సింహం కుక్కను తన ప్రాణ స్నేహితుడిలా చూస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన వీడియో ToyQuest101 అనే ఖాతా ద్వారా YouTubeలో షేర్‌ చేయబడింది. వార్త రాసే సమయానికి 33 వేల మందికి పైగా చూసారు. ఇది కాకుండా 1.6 మిలియన్లకు పైగా ప్రజలు దీనిని లైక్‌ చేశారు.ఒక వినియోగదారు వీడియోపై వ్యాఖ్యానిస్తూ, “ఈ వీడియో చాలా అందంగా ఉందంటూ కామెంట్‌ చేశారు. వీటిని చూసిన ప్రజలు కూడా దీని నుండి కొంత నేర్చుకోవాలి” అని అన్నారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, సింహం స్నేహపూర్వక ప్రవర్తనను నేను చూడటం ఇదే మొదటిసారి. అంటూ కామెంట్‌ చేశారు. ఇంకా చాలా మంది నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు.