AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రలేమికి ఈ 5 తప్పులే కారణం.. మీరూ చేస్తున్నారా చెక్ చేసుకోండి.. లేదంటే రిస్క్‌లో పడినట్టే

ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి సంపాదించేది తినడానికే.. తిన్నది డైజెస్ట్ కావాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో పడుకోవడానికి సమయం కేటాయించడం కూడా చాలా మందికి కష్టమైపోతోంది. నిద్ర కరువైతే అనారోగ్య సమస్యలు ఒకదాని వెంట ఒకటి శరీరంపై దాడి చేస్తాయి.

నిద్రలేమికి ఈ 5 తప్పులే కారణం.. మీరూ చేస్తున్నారా చెక్ చేసుకోండి.. లేదంటే రిస్క్‌లో పడినట్టే
Sleeping Tips.jpg
Nikhil
|

Updated on: Feb 16, 2026 | 9:54 PM

Share

రోజంతా కష్టపడి పని చేసి రాత్రి ఇంటికి రాగానే హాయిగా నిద్రపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ చాలామందికి బెడ్ మీద పడుకోగానే నిద్ర రాదు. స్మార్ట్‌ఫోన్ తీసి రీల్స్ చూడటం లేదా పాత విషయాలను తలుచుకుంటూ గంటల కొద్దీ మేల్కొనే ఉంటారు. దీనివల్ల మరుసటి రోజు పనిలో ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, చిరాకు, నీరసం ఆవహిస్తాయి. నిద్ర అనేది మన శరీరానికి ఒక రీఛార్జ్ లాంటిది. అది సరిగ్గా లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మీ లైఫ్ స్టైల్ లో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • మన శరీరంలో ఒక అంతర్గత గడియారం ఉంటుంది, దానినే ‘సిర్కాడియన్ రిథమ్’ అంటారు. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఉదయాన్నే ఒకే టైమ్‌కి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి ఎప్పుడు నిద్రపోవాలో ఒక పద్ధతి అలవాటు అవుతుంది. సెలవు రోజుల్లో కూడా ఈ సమయాన్ని మార్చకుండా ఉండటం వల్ల గాఢ నిద్ర పట్టే అవకాశం ఉంటుంది.
  • చాలామంది రాత్రి పూట కూడా కాఫీ లేదా టీ తాగుతుంటారు. వీటిలో ఉండే కెఫిన్ మన మెదడును అలెర్ట్ గా ఉంచుతుంది, దీంతో నిద్ర రాదు. నిద్రపోయే ఆరు గంటల ముందే కెఫిన్ ఉన్న పానీయాలను ఆపేయాలి. అలాగే ఆల్కహాల్ తాగితే నిద్ర వస్తుందని కొందరు భావిస్తారు కానీ, అది నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. గాఢ నిద్రకు ఆటంకం కలిగించి అర్ధరాత్రి మెలకువ వచ్చేలా చేస్తుంది.
  • మనం నిద్రపోయే గది ఎలా ఉందనేది మన నిద్రను ప్రభావితం చేస్తుంది. బెడ్ రూమ్ ఎప్పుడూ శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. గది ఉష్ణోగ్రత మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. లైట్లు డిమ్ గా ఉంటే శరీరంలో నిద్రను ప్రేరేపించే హార్మోన్లు విడుదలవుతాయి. ముఖ్యంగా పడక గదిని కేవలం నిద్రకు, విశ్రాంతికి మాత్రమే పరిమితం చేయాలి.
  • మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి వచ్చే ‘బ్లూ లైట్’ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల మన మెదడు అది పగలు అని పొరబడి నిద్రను దూరం చేస్తుంది. నిద్రపోయే ఒక గంట ముందు నుంచే గాడ్జెట్లను దూరంగా పెట్టడం అలవాటు చేసుకోండి. రీల్స్ చూడటం ఒక వ్యసనంలా మారి మీ విలువైన నిద్ర సమయాన్ని హరించేస్తుందని గుర్తించాలి.
  • పడుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి. ఒక మంచి పుస్తకం చదవడం, మెలోడీ సంగీతం వినడం లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే డీప్ బ్రీతింగ్ (లోతైన శ్వాస) లేదా ధ్యానం చేయడం వల్ల మనస్సులోని ఆందోళనలు తొలగిపోయి శరీరం నిద్రకు సిద్ధమవుతుంది.
  • రాత్రి పూట మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం, డీప్ ఫ్రై చేసిన పదార్థాలు తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభంగా జరిగి హాయిగా నిద్ర పడుతుంది. అలాగే పగటి పూట ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల రాత్రి పూట మెలకువగా ఉండే ప్రమాదం ఉంది. అందుకే పగలు కేవలం 20 నిమిషాల ‘పవర్ నాప్’ మాత్రమే తీసుకోవాలి.

మంచి నిద్ర అనేది ఖరీదైన మందుల వల్ల రాదు, కేవలం క్రమశిక్షణతో కూడిన అలవాట్ల వల్ల మాత్రమే వస్తుంది. ఉదయం పూట కాసేపు ఎండలో ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా రాత్రి పూట గాఢ నిద్ర పట్టేలా చేస్తాయి.

Follow Us