self lockdown: తెలంగాణ ప‌ల్లెల్లో సెల్ఫ్ లాక్ డౌన్ స‌క్సెస్.. వ్యాప్తి క‌ట్ట‌డికి మ‌రో మార్గం లేదు

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొదటి దశలో పట్టణాల్లో ఎక్కువగా ప్రభావం చూపిన మహమ్మారి.. రెండో దశలో పట్నం, పల్లే అనే తేడా లేకుండా వేగంగా......

self lockdown: తెలంగాణ ప‌ల్లెల్లో సెల్ఫ్ లాక్ డౌన్ స‌క్సెస్.. వ్యాప్తి క‌ట్ట‌డికి మ‌రో మార్గం లేదు
lockdown
Follow us

|

Updated on: May 05, 2021 | 9:12 AM

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొదటి దశలో పట్టణాల్లో ఎక్కువగా ప్రభావం చూపిన మహమ్మారి.. రెండో దశలో పట్నం, పల్లే అనే తేడా లేకుండా వేగంగా వ్యాప్తి చెందుతోంది. వరంగల్‌ రూరల్, మహబూబబాద్ జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. దీంతో పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు విధిస్తున్న స్వయం ప్రకటిత లాక్‌డౌన్ వైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. నాలుగు రోజులుగా వరంగల్ రూరల్ జిల్లాలోని నెక్కొండ, చిన్నకోర్పోల్ గ్రామాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. కేసులు తగ్గకపోతే సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు కొనసాగిస్తామని గ్రామాల ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మహబూబబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ మేజర్ గ్రామాల్లో స్వచ్చందంగా సెల్ఫ్ లాక్ డౌన్ పాటిస్తున్నారు.

వైరస్‌ కట్టడికి పంచాయతీ పాలకవర్గాలు తీర్మానాలు చేసి లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించేలా నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగూడలో కేసులు పెరుగుతుండటంతో గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానంతో లాక్‌డౌన్‌ను విధించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.5వేలు జరిమానా వేస్తామని హెచ్చరించారు.

నెక్కొండ మేజర్‌ పంచాయతీలో 70కి పైగా కరోనా కేసులుండటంతో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ప్రజలు, వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆంక్షలు విధించారు. ఇందుకు ప్రజలు సైతం పూర్తిగా సహకరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికీ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. స్వచ్చంద లాక్‌డౌన్‌ ద్వారా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా కేసులు పెరగడం లేదని, కొత్తవారికి కరోనా అంటడం లేదని అంటున్నారు. మొత్తానికి సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ సక్సెస్‌ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: : ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌ర్ఫ్యూ స‌మ‌యంలో శ్రీవారి ద‌ర్శ‌నం ఉంటుందా.? క్లారిటీ ఇచ్చిన టీటీడీ..

 ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక ఉత్తర్వులు.. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి..