AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seethakka: రాఖీ కట్టిన సీతక్క.. ‘మంచి చీర కొనుక్కో’ అంటూ కోమటిరెడ్డి ఎంతిచ్చారో తెలుసా..?

రాష్ట్రవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి సీతక్క మంత్రులు, స్పీకర్‌కు రాఖీ కట్టారు. ముందుగా ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాఖీ కట్టారు మంత్రి సీతక్క. ఆ తర్వాత.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరకు వెళ్లారు సీతక్క. అప్యాయంగా పలకరించి రాఖీ కట్టారు. అన్నదమ్ముల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ అన్నారు. అక్కడి నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇంటికి వెళ్లారు సీతక్క. స్పీకర్‌కు రాఖీ కట్టి.. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క రాఖీ కట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తర్వాత సీఎం రేవంత్, ఆయన మనవడికి సైతం సీతక్క రాఖీ కట్టారు.

Seethakka: రాఖీ కట్టిన సీతక్క.. 'మంచి చీర కొనుక్కో' అంటూ కోమటిరెడ్డి ఎంతిచ్చారో తెలుసా..?
Sethakka Komatireddy Venkatareddy
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Aug 09, 2025 | 4:38 PM

Share

దేశ వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాఖీ పౌర్ణమి పండుగ సోదర-సోదరీమణుల అనుబంధాన్ని మరింత బలపరిచే వేడుకలతో తెలంగాణలో ఉత్సాహంగా కొనసాగుతోంది. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క.. పలువురు ప్రముఖ నేతలకు రాఖీలు కట్టి వారి పట్ల.. తన ఆప్యాయతను చాటుకున్నారు. మంత్రుల నివాస సముదాయంలో ఆమె సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాఖీ కట్టి.. పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సీతక్క తన సొంత సోదరి లాంటిదని చెప్పుకొచ్చారు. రాఖీ పండుగ అన్న-చెల్లెలు, అక్కా-తమ్ముళ్ల బంధాన్ని మరింత గాఢం చేస్తుందని, ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం… కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన జేబులోని నోట్ల కట్టను తీసి సీతక్కకు బహుమతిగా అందించారు. ఆమె వద్దని నిరాకరించినా… మంచి చీర కొనుక్కో అంటూ పట్టుబట్టి అందించడం అందర్నీ ఆకట్టుకుంది.

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సీతక్క రాఖీ కట్టారు. సీఎం నివాసంలో రాఖీ కట్టిన ఆమె.. ముఖ్యమంత్రితో పాటు ఆయన మనవడికీ రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ వేడుకలో సీఎం సతీమణి, కుమార్తెతో కలిసి పండుగ వాతావరణాన్ని పంచుకున్నారు. అదేవిధంగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కూడా రాఖీ కట్టారు సీతక్క. రాష్ట్రంలోని కీలక నేతలతో ఆప్యాయ బంధాన్ని పంచుకుంటూ, రాఖీ పండుగ ప్రేమ, రక్షణ, అనుబంధానికి ప్రతీక సీతక్క చాటిచెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.