AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gajwel Train: ఫలించిన తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం.. సిద్ధిపేట, గజ్వేల్‌లో వినిపించిన రైలు కూత..

Manoharabad-Gajwel Goods Train: టీవలే ఏర్పాటు చేసిన గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌లో మొదటి రైలు ప్రారంభమైంది. మనోహరాబాద్‌ గజ్వేల్‌ సెక్షన్‌లో రవాణా అవుతున్న మొదటి సరుకు రవాణా రైలు కూడా ఇదే.

Gajwel Train: ఫలించిన తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం.. సిద్ధిపేట, గజ్వేల్‌లో వినిపించిన రైలు కూత..
Manoharabad-Gajwel Goods Train
Sanjay Kasula
|

Updated on: Jun 27, 2022 | 5:04 PM

Share

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.  ఇటీవలే ఏర్పాటు చేసిన గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌లో మొదటి రైలు ప్రారంభమైంది. మనోహరాబాద్‌ గజ్వేల్‌ సెక్షన్‌లో రవాణా అవుతున్న మొదటి సరుకు రవాణా రైలు కూడా ఇదే. దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్‌ డివిజన్‌లో గజ్వేల్‌ స్టేషన్‌ ఉంది. ఇక్కడ సంచులలో గల సరుకుల లోడిరగ్‌, అన్‌లోడిరగ్‌ కోసం సరుకు రవాణాకు ఇటీవలే అనుమతులు ఇవ్వబడ్డాయి. ఇందులో భాగంగా, 21 బీసీఎన్‌ వ్యాగన్లలో ఎరువులతో కూడిన మొదటి రేక్‌ కాకినాడ నుంచి బుక్‌ చేయబడింది. గజ్వేల్‌ స్టేషన్‌లోని గజ్వేల్‌ గూడ్స్‌ షెడ్‌లో అన్‌లోడిరగ్‌ కోసం ఉంచారు. గజ్వేల్‌ స్టేషన్‌కు చేరుకున్న మొదటి రేక్‌ ద్వారా 1,844 టన్నుల ఎరువులు రవాణా చేయబడ్డాయి.

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు దాదాపు 151 కిలో మీటీర్ల పొడవునా రూ. 1160.47 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు మనోహరాబాద్ నుంచి గజ్వేల్‌ మండలం కొడకండ్ల వరకు సుమారు 43 కిలోమీటర్ల మార్గం పూర్తయింది. అధికారులు ఇప్పటికే మూడుసార్లు మార్గాన్ని పరీక్షించి ఓకే చెప్పారు అధికారులు.

తెలంగాణ స్టేషన్లలో గజ్వేల్‌ స్టేషన్‌ చాలా ముఖ్యమైన స్టేషన్‌. మనోహరాబాద్‌`కొత్తపల్లి మధ్య నూతన రైల్వే లైన్‌ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ నూతన రైల్వే లైను నిర్మించబడింది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు నిర్మిస్తున్న రైలు మార్గంలోని తొలి దశలో భాగంగా చేపట్టిన మనోహరాబాద్‌-గజ్వేల్‌-కొడకండ్ల మార్గంలో 42.6 కిలోమీటర్ల మేర అన్ని పనులు పూర్తయ్యాయి.

త్వరలోనే సిద్దిపేట రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన..

మనోహరాబాద్‌ నుంచి వర్గల్‌ మండలం నాచారం, రాయపోల్‌ మండలం అప్పాయిపల్లి మీదుగా గజ్వేల్‌ పట్టణం వరకు మూడు స్టేషన్లతో పాటు రైల్వేట్రాక్‌ నిర్మాణం పూర్తయింది. మనోహరాబాద్‌ నుంచి నాచారం, బేగంపేట, అప్పాయిపల్లి, గజ్వేల్‌, కొడకండ్ల రైల్వే స్టేషన్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. లకుడారం, దుద్దెడ, సిద్దిపేట స్టేషన్ల కూడా పూర్తయ్యాయి. గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌లో మొత్తం 5 లైన్లుగా రైల్వే పట్టాలను వేశారు. మొదటి మూడు లైన్లలో ప్యాసింజర్‌ రైళ్లు, 4వ లైనులో గూడ్స్‌ రైళ్లు, 5వ లైన్‌లో ప్యాకింగ్‌, మరమ్మతులు, ఇంజిన్ల సైడింగ్‌ కోసం వినియోగించనున్నారు. రెండో దశ పనుల్లో గజ్వేల్‌ నుంచి దుద్దెడ వరకు 32 కిలోమీటర్ల నిర్మాణం ఉంటుంది.

తొలి దశలో..

మొదటి దశలో 2020 జూన్‌లో మనోహరాబాద్‌`గజ్వేల్‌ మధ్య 31 కిమీల మేర నూతన రైల్వే లైన్‌ పూర్తయ్యి ప్రారంభించబడింది. మిగతా సెక్షన్లలో పనులు పురోగతిలో ఉన్నాయి. గజ్వేల్‌ స్టేషన్‌లో సరుకు రవాణా నిర్వహణతో సరుకు రవాణా వినియోగదారులు తమ సరుకులను రవాణా చేసి వారి వ్యాపార లావాదేవీల పెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. స్టేషన్‌ పరిసర ప్రాంతాలకు ఆహార ధాన్యాలు, ఎరువులు వంటి అత్యవసర సరుకులను వేగంగా.. తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది. కరీంనగర్‌ వైపు దగ్గరగా.. అనుకూలమైన మార్గంగా ఉండే ఈ రైల్వే లైన్‌ పనులు మొత్తం పూర్తయితే మెదక్‌, సిద్దిపేట జిల్లాల నివాసితుల చిరకాల వాంఛ నెరవేరుతుంది.

మొదటి రేక్‌లో నిన్న కాకినాడలోని నాగార్జున ఫర్టిలైజర్స్‌, కెమికల్స్‌ సైడిరగ్‌ నుంచి 1844 టన్నుల ఎరువులు లోడ్‌ అయ్యాయి. సోమవారం( 27 జూన్‌ 2022) గజ్వేల్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఈ గూడ్స్‌ రైలు 632 కిమీలు మేర ప్రయాణించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ గజ్వేల్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేసి సరుకు రవాణా ప్రారంభానికి కృషి చేసిన హైదరాబాద్‌ డివిజన్‌ మరియు కనస్ట్రక్షన్‌ విభాగం అధికారులు, సిబ్బంది బృందాన్ని అభినందించారు. దీనితో ఇక్కడి చుట్టు పక్కల ప్రాంతాలు, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సరుకు రవాణా ప్రోత్సాహానికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

తెలంగాణ వార్తల కోసం..