AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmal: ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి మరీ ఆందోళన.. ఎందుకో తెలిస్తే షాకే

ప్రభుత్వ పాఠశాల గేట్లకు తాళాలు వేసి కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్న ఘటనలు వరుసగా కొనసాగుతున్నాయి. నిన్న ఖానాపూర్ మండలం రాజురా.. ఈరోజు దండెపల్లి మండలం వెల్గనూర్.. ప్రాంతాలు వేరైనా సమస్య మాత్రం ఒక్కటే. చేసిన కాంట్రాక్ట్‌ పనుల తాలూకు బిల్లులు మంజూరు చేయాలంటూ గేటుకు..

Nirmal: ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి మరీ ఆందోళన.. ఎందుకో తెలిస్తే షాకే
Representative Image
Naresh Gollana
| Edited By: |

Updated on: Jun 18, 2025 | 1:37 PM

Share

ప్రభుత్వ పాఠశాల గేట్లకు తాళాలు వేసి కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్న ఘటనలు వరుసగా కొనసాగుతున్నాయి. నిన్న ఖానాపూర్ మండలం రాజురా.. ఈరోజు దండెపల్లి మండలం వెల్గనూర్.. ప్రాంతాలు వేరైనా సమస్య మాత్రం ఒక్కటే. చేసిన కాంట్రాక్ట్‌ పనుల తాలూకు బిల్లులు మంజూరు చేయాలంటూ గేటుకు తాళాలు వేసి పాఠశాల ఎదుట నిరసనలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో చేసిన పనులకు తాజా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులకు విడుదల చేయక ముప్పు తిప్పలు పెడుతుందని.. అప్పులు తెచ్చి పనులు చేశామని.. బిల్లులు రాకుంటే చావొక్కటే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన కు దిగుతున్నారు బాధితులు.

తాజాగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటుకు తాళం వేసి పురుగుమందు డబ్బాతో గేటు ముందు నిరసనకు దిగారు స్కూల్ విద్యా కమిటి చైర్మెన్ గడికొప్పుల విజయ, ఆమె భర్త గడికొప్పుల తిరుపతి. గత బీఆర్ఎస్ హయంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా స్కూల్ డైనింగ్ హాల్ తో పాటు పాఠశాల మరమ్మత్తులు చేపట్టామని.. ప్రభుత్వం మారడంతో బిల్లులు పెండింగ్ లో పడిపోయాయని.. నిర్మాణానికి 28 లక్షల నిధులు ఖర్చు చేశామని.. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు బాదితులు. అప్పులు చేసి పాఠశాలను అభివృద్ది‌ చేస్తే కొత్తగా వచ్చిన ప్రభుత్వం బిల్లులను పెండింగ్‌ లో పెట్టిందని ఆరోపిస్తూ స్కూల్ గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ తిరుపతి. పురుగు మందు డబ్బాతో నిరసన తెలుపడంతో రంగంలోకి దిగిన పోలీసులు బాదితునికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అదికారులతో మాట్లాడించి న్యాయం చేస్తామని తెలుపారు.

నిన్న నిర్మల్ జిల్లా ఖానాపూర్‌ మండలం రాజుర గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. గత ప్రభుత్వ హయాంలో శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ రాజురా గ్రామంలోని పాఠశాలలో రూ. 37 లక్షల నిధులతో భవనాన్ని నిర్మించగా.. రూ. 14 లక్షల బిల్లులు చేతికి వచ్చాయి. మిగిలిన రూ. 23 లక్షల బిల్లులు మూడేళ్లుగా మంజూరు కాలేదు. దీంతో కొద్ది రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు శ్రీనివాస్. దీంతో సోమవారం పాఠశాల వద్దకు వచ్చి.. తనకు చెల్లించాల్సిన బిల్లులు వచ్చే వరకూ పాఠశాల భవనంలోకి ఎవరినీ వెళ్లనిచ్చేది లేదంటూ తాళం వేసి.. ఆందోళన చేశాడు. ఆ తర్వాత గేటు బయట పెట్రోల్‌ డబ్బాతో కూర్చున్నాడు. బిల్లులు రాక అప్పులపాలై ఉన్నాం , బిల్లులు ఇవ్వకపోతే చావే శరణ్యం అంటూ ఆందోళన చేపట్టాడు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు అదికారులతో మాట్లాడించి న్యాయం చేస్తామని తెలుపడంతో ఆందోళన విరమించాడు బాధితుడు.