AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Seed Corporation: సీడ్‌ కార్పొరేషన్‌లో భారీ స్కామ్? కార్పొరేషన్‌ సొమ్ముతో విదేశీ టూర్లు, జల్సాలు

తెలంగాణ విత్తనోత్పత్తి కార్పొరేషన్‌లో అవినీతి సిత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత తొమ్మిదేళ్లలో ఈ సంస్థలో లక్షల రూపాయలు హాంఫట్‌ అయ్యాయి. గ్రో ఔట్‌ ఫామ్‌ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన చెరో రూ.50 లక్షలు.. మొత్తం రూ.కోటి స్వాహా అయినా పట్టించుకునే నాథుడు లేడు.

TS Seed Corporation: సీడ్‌ కార్పొరేషన్‌లో భారీ స్కామ్? కార్పొరేషన్‌ సొమ్ముతో విదేశీ టూర్లు, జల్సాలు
Telangana Seed Corporation
Balaraju Goud
|

Updated on: Mar 07, 2024 | 11:20 AM

Share

తెలంగాణ విత్తనోత్పత్తి కార్పొరేషన్‌లో అవినీతి సిత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత తొమ్మిదేళ్లలో ఈ సంస్థలో లక్షల రూపాయలు హాంఫట్‌ అయ్యాయి. గ్రో ఔట్‌ ఫామ్‌ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన చెరో రూ.50 లక్షలు.. మొత్తం రూ.కోటి స్వాహా అయినా పట్టించుకునే నాథుడు లేడు. అంతేకాదు తెలంగాణను సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియ’గా మారుస్తామని గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించగా, గడిచిన పదేళ్లలో విత్తనోత్పత్తి కాస్తా ఏటా నేలచూపులు చూస్తూ, అథఃపాతాళానికి పడిపోయింది.

విత్తనాల నాణ్యతను ధ్రువీకరించే సీడ్‌ సర్టిఫికేషన్‌ అథారిటీలోనూ అన్నీ అవకతవకలే..! ఇక్కడ సిబ్బంది బయోమెట్రిక్‌ ఉండదు. ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది అసలు విధుల్లోకే రారు. సంతకాలు చేయరు. తొమ్మిదేళ్లుగా జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌గా, సీడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ హెచ్‌వోడీగా, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండీగా కె.కేశవులు పనిచేస్తున్నారు. ఈ తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 28 విదేశీ పర్యటనలు చేశారు. ఏ ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఇన్ని విదేశీ పర్యటనలు చేయకపోవడం విశేషం.

హైదరాబాద్‌లో 2019 జూన్‌ నెలలో 32వ ఇస్టా కాంగ్రెస్‌ సదస్సును నిర్వహించారు. 75 దేశాల నుంచి 451 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరైనట్లు ఇస్టా కాంగ్రెస్‌ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన డాక్టర్‌ కె.కేశవులు అప్పట్లో వెల్లడించారు. ఈ సదస్సు నిర్వహణకు అప్పట్లో రైతుబంధు నిధులను మళ్లించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. సుమారు 10 కోట్ల రూపాయల నిధులను ఇస్టా కాంగ్రెస్‌ సదస్సుకు ఖర్చు చేశారు. ఇందులో పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలున్నాయి. మూడు రోజులకు నోవాటెల్‌ హోటల్‌ హాలు, భోజనాలకే 70 లక్షల ఖర్చు రాశారు. చివరకు నోడల్‌ ఆఫీసర్‌ కేశవులు ఐ-ఫోన్‌ కోసం 65 వేలను ఈ నిధుల్లోంచే ఖర్చు చేశారు. హైదరాబాద్‌లోని పలు స్టార్‌ హోటళ్ల పేరుతో విచ్చలవిడిగా బిల్లులను సమర్పించారు. దీనిపై అప్పట్లో విమర్శలు వచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదు.

తాజాగా సీడ్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు అసలు భాగోతం బయటపడటంతో విచారణ చేపట్టేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

సచిన్, ఇర్ఫాన్ ఖాన్​లతో అరుదైన క్షణాలు..విజయ్ వర్మ ఎమోషనల్ పోస్ట్
సచిన్, ఇర్ఫాన్ ఖాన్​లతో అరుదైన క్షణాలు..విజయ్ వర్మ ఎమోషనల్ పోస్ట్
99,99,999 విగ్రహాలతో..ఇండియన్ మిస్టీరియస్ టెంపుల్..
99,99,999 విగ్రహాలతో..ఇండియన్ మిస్టీరియస్ టెంపుల్..
ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న వీటి ధరలు
ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న వీటి ధరలు
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నంద్యాల జిల్లాలో..
కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నంద్యాల జిల్లాలో..
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!