Viral: పైకి చూస్తే మొక్కజొన్న సాగు.. తీరా లోపలికెళ్లి చూడగా పోలీసుల దిమ్మతిరిగింది!
తులసి వనంలో గంజాయి మొక్క సామెతను.. మీరు వినే ఉంటారు. ఈ సామెతను ఓ రైతు నిజం చేసి చూపించాడు. ఇంతకీ అసలు అతడు ఏం చేశాడని అనుకుంటున్నారా.? స్థానికులు, పోలీసులు షాక్ అయినట్టు.. మీరు కూడా ఆ స్టోరీ వింటే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇంతకీ అసలు ఇది ఎక్కడ జరిగింది.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయ పొలంలో సాగు చేస్తున్న గంజాయి తోటపై ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం రావులపల్లి కలాన్ గ్రామంలో సుధీర్ అనే రైతు జొన్న చేనులో గంజాయి సాగు చేస్తున్నాడు. ఇక పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటి బృందం బుధవారం సాయంత్రం గంజాయి తోటపై దాడులు నిర్వహించారు. ప్రభుత్వం గంజాయిని నిషేధించినప్పటికీ రైతు యదేచ్ఛగా తన పంట పొలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడని ఎస్ఓటి పోలీసులు చెప్పారు. వందల సంఖ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. చేవెళ్ల ఎక్సైజ్ సీఐ శ్రీలత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఎక్కువగా డబ్బులకు ఆశపడి మొక్కజొన్న చేనులో గంజాయి మొక్కల సాగు చేస్తున్న రైతు సుధీర్ చివరికి కటకటాలపాలయ్యాడు.