AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saidabad Incident: సైదాబాద్ రాజు ఎట్టకేలకు సూసైడ్.. ఈ కథకు ఇక్కడితో ఎండ్ కార్డ్ పడినట్లేన.. అసలేం జరిగింది..

సైదాబాద్ రాజు ఎట్టకేలకు సూసైడ్ చేస్కున్నాడు. ఈ ఎనిమిది రోజుల్లో జరిగిన అతి ముఖ్యమైన ఎనిమిది ఘటనలు ఏవి? డేవన్ టూ డే లాస్ట్ అసలేం జరిగింది?సింగరేణి కాలనీ బాలిక హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

Saidabad Incident: సైదాబాద్ రాజు ఎట్టకేలకు సూసైడ్.. ఈ కథకు ఇక్కడితో ఎండ్ కార్డ్ పడినట్లేన.. అసలేం జరిగింది..
Saidabad 6 Year Old Child M
Sanjay Kasula
|

Updated on: Sep 16, 2021 | 1:56 PM

Share

సైదాబాద్ రాజు ఎట్టకేలకు సూసైడ్ చేస్కున్నాడు. ఈ ఎనిమిది రోజుల్లో జరిగిన అతి ముఖ్యమైన ఎనిమిది ఘటనలు ఏవి? డేవన్ టూ డే లాస్ట్ అసలేం జరిగింది?సింగరేణి కాలనీ బాలిక హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్ల పాపపై హత్యాచార కేసులో ఇతడు నిందితుడు. సెప్టెంబర్ 9న హైదరాబాద్, సైదాబాద్ కాలనీలో ఆరేళ్ల పాపపై అత్యాచారం చేశాడీ పాపాత్ముడు. ముప్పై ఏళ్ల రాజు ఆటోడ్రైవర్ గా పని చేశాడని చెబుతున్నారు స్థానికులు. అల్లరి చిల్లరగా తిరిగే.. జులాయిగా ఇతడికి పేరుంది. తన భార్యను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంటున్నారు స్థానికులు. ఇపుడదే భార్య రాజు మరణానంతరం తీవ్రంగా ఏడవటం కనిపించింది.

ఇలాంటి మెంటాలిటీ ఉన్న రాజు సెప్టెంబర్ 9వ తేదీన- మాదన్నపేటలో భవన నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. ఉదయం 9 గంటలకు పనికి వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు తన గదికి తిరిగొచ్చాడు. సాయంత్రం నాలుగున్నర- 5 గంటల మధ్యలో చిన్నారికి మాయ మాటలు చెప్పి తన రూమ్‌కు తీసుకొచ్చాడు. రూమ్ లోనే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె అరుస్తుంటే గొంతు నులిమి చంపేశాడు.

తర్వాత గదికి తాళం వేసి బయటకు వచ్చాడు. ఆ తర్వాత తాగిన మైకంలో అదే ప్రాంతంలో తచ్చాడాడు. సాయంత్రం ఏడు గంటలకు అక్కడే ఉన్న పానీపూరీ బండి దగ్గర పానీపూరీ తిన్నాడు. అప్పటికే పాప కనిపించడం లేదంటూ.. సింగరేణి కాలనీ వాసులు వెతుకుతున్నారు. రాత్రి తొమ్మిది గంటలకు చిన్నారి నాయనమ్మ కనిపించగా.. ఆమెతో పాప కనిపించిందా? అని అడిగాడు. తాగిన మత్తులో రోడ్డుపై వెళ్తున్న అతడలా ప్రశ్నించే సరికి ఆమెలో ఒక అనుమానం. ఈ విషయం తన ఇంట్లో వాళ్లకు చెప్పిందామె.

పాప చెవికి వున్న బంగారు దుద్దుల కోసం తమ కుమార్తెను ఎత్తుకుపోయి ఉండవచ్చని అనుమానించారు కుటుంబ సభ్యులు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విన్న రాజు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. 9గంటలకు స్థానికుల సాయంతో చిన్నారి కుటుంబ సభ్యులు రాజు గదికి వెళ్లారు. గదికి తాళం వేసి ఉండటంతో.. తాళం పగలగొట్టే యత్నం చేశారు. కానీ పోలీసులు వద్దన్నారు.

రాత్రి పన్నెండు వరకూ ఆమె కోసం వెతికారు. ఇక లాభం లేదని చెప్పి.. రాజు గది దగ్గరకొచ్చి తాళం పగలగొట్టారు. దీంతో అక్కడ పాప మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా చలించిపోయారు. తాము చెప్పినప్పుడే తాళం పగలగొట్టి ఉంటే పాప ప్రాణాలతో దక్కి ఉండేదన్న చర్చ నడిచింది.

రాజు కోసం ఈస్ట్ జోన్ డీసీపీ అధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు రాజు కోసం గాలింపు మొదలు పెట్టాయి. సెప్టెంబర్ 15న.. రాజు ఆచూకీ తెలిపితే రూ.10లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు సీపీ అంజనీకుమార్. ఒక్క నగరం మాత్రమే కాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా పాపకోసం తీవ్రంగా గాలించారు.

సెప్టెంబర్ 16న ఉదయం 8.45గంటలకు స్టేషన్ ఘన్ పూర్ దగ్గర్లోని.. నాష్కల్ రైల్వే ట్రాక్ పై రాజు మృత దేహం గుర్తించారు. నిందితుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటించారు పోలీసులు.

చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడ్ని గుర్తించామని అంటన్నారు అధికారులు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఈ సైకో సూసైడ్ చేస్కున్నట్టు ప్రకటించారు. నిందితుడ్ని పట్టుకున్న వెంటనే ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్లు చేస్తున్న ఈ తరుణంలో రాజు మృతదేహం లభ్యం కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి: సైదాబాద్ చిన్నారి ఆత్మ శాంతించింది.. సరిగ్గా వారం రోజులకే రైల్వే పట్టాలపై శవమైన మానవ మృగం

Saidabad Incident: మేమున్నాం మీకు.. బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చిన మంత్రులు.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ..