YS Sharmila: సైదాబాద్‌ రాజు ఆత్మహత్య వ్యవహారంపై స్పందించిన వైఎస్‌ షర్మిల.. ఏమన్నారంటే..

YS Sharmila: సింగరేణి కాలనిలో ఆరేళ్ల పాపను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేసిన నిందితుడు రాజు ఎట్టకేలకు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. వ‌రంగ‌ల్ జిల్లాలోని...

YS Sharmila: సైదాబాద్‌ రాజు ఆత్మహత్య వ్యవహారంపై స్పందించిన వైఎస్‌ షర్మిల.. ఏమన్నారంటే..
Follow us

|

Updated on: Sep 16, 2021 | 2:31 PM

YS Sharmila: సింగరేణి కాలనిలో ఆరేళ్ల పాపను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేసిన నిందితుడు రాజు ఎట్టకేలకు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. వ‌రంగ‌ల్ జిల్లాలోని న‌ష్‌క‌ల్‌ రైల్వేట్రాక్‌పై రాజు శవమై తేలాడు. వారం రోజుల పాటు తెలంగాణ పోలీసుల నుంచి తప్పించుకు తిరిగిన రాజు చివరికి తగిన మూల్యం చెల్లించుకున్నాడని అందరూ వాదిస్తున్నారు. ఇక రాజు మరణంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా స్పందించారు. బుధవారం చిన్నారికి కుటుంబ సభ్యులను పరమార్శించిన షర్మిల అక్కడే నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే అర్ధరాత్రి దాటాకా పోలీసులు ఆమె ధీక్షను భగ్నం చేశారు. ఇక తాజాగా రాజు మరణ వార్త తెలిసిన షర్మిల ట్విట్టర్‌ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘సింగరేణి కాలనిలో 6 సంవత్సరాల పాపను, అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తే 6 రోజులైనా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మొఖం చెల్లని ఈ ప్రభుత్వానికి, మేము నిన్న చేసిన దీక్ష వల్ల దిగొచ్చి.. ఈ రోజు మంత్రులు వారి కుటుంబాన్ని పరామర్శించారు’అని విమర్శించారు. నిన్నా మొన్న ఆ కుటుంబాన్ని కలవడానికి రాని మంత్రులు.

ఈరోజు నిందితుడు చనిపోయిన తరువాత, ఆ కుటుంబాన్ని కలవడానికి పోటీ పడటానికి సిగ్గుండాలె. నిందితుడిని పట్టుకోవడంలో వైఫల్యానికి ఒక్క ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. రేపిస్ట్ ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వ అసమర్థతను, కేసీఆర్‌ పాలనలో పోలీసులపై ప్రజలకు లేని నమ్మకాన్ని వేలెత్తి చూపిస్తూనే ఉన్నాడు’ అంటూ రాసుకొచ్చారు.

షర్మిల ట్వీట్..

Also Read: Saidabad Incident: సైదాబాద్ రాజు ఎట్టకేలకు సూసైడ్.. ఈ కథకు ఇక్కడితో ఎండ్ కార్డ్ పడినట్లేన.. అసలేం జరిగింది..

సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి మోహన్ భగవత్‌ను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి..

MLA Seethakka: ప్రజా పోరాటాల వల్లే రాజు చచ్చాడు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు