Telangana: ఆ ప్రాంతంలో స్టూడెంట్స్ కు ఆర్టీసి బస్సులో ప్రయాణం అందని ద్రాక్షే.. ఎందుకంటే..
ఆర్టీసి బస్సుల్లో విద్యార్థులు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఉదయం, సాయంత్రం.. ఆర్టీసి బస్సుల్లో నిలబడుదామంటే.. స్థలం ఉండటం లేదు. దీని కారణంగా విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు యుద్ధమే చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్టేజీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అంతేకాకుండా ఉదయంవేళ బస్సులు తక్కువగా ఉండటంతో వచ్చిన బస్సులో వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే బస్సు నిండా జనం ఉండటంతో ఎక్కాలేకపోతున్నారు. మొత్తానికి తరగతి గదికి వెళ్లాడానికి విద్యార్థులు పరేషాన్ అవుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం చేయడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యా సంవత్సరం మొదలు కావడంతో.. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్నారు. ముఖ్యంగా అప్ ఆన్ డౌన్ చేస్తున్నారు. అయితే ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రయాణించే ఆర్టీసి బస్సులు కిక్కిరిపోతున్నాయి. విద్యార్థులు బస్సులోకి వెళ్లడమే కష్టంగా మారింది. దానికి తోడు బ్యాగ్ వెళ్లాలి కనీసం నిల్చుకోవడానికి కూడా అవకాశం ఉండటం ఉండడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా స్టేజీల వద్ద విద్యార్థులు ఎక్కువగా ఉంటే బస్సులు ఆగకుండా వెళ్లున్నాయి. దీంతో విద్యార్థులు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచీ ఒక్కటి, రెండు బస్సులు మాత్రమే వస్తున్నాయి. అందులో ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ అప్పటికే ప్రయాణీకులతో బస్సు నిండిపోయి ఉంటుంది. దీంతో కష్టంగానే ప్రయాణం చేస్తున్నారు.
అదే విధంగా సుల్తానాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, ధర్మపురి తదితర బస్ స్టాండ్ల వద్ద విద్యార్థుల తో కిక్కిరిసి పోతుంది. పెరిగిన రద్దీ కారణంగా చాలా మంది ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఆటోలోనే వెళ్తున్నారు. ఆటోలో వెళ్లడం ప్రమాదకరమని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కానీ తప్పడం లేదు. సాయంత్రం పూట మరింత రద్దీగా ఉంటుంది. సరిగా బస్సులు దొరకడం లేదు. ఇంటికి ఆలస్యంగా వెళ్తున్నారు. విద్యార్థులు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆర్టీసి బస్సులను నడిపిస్తుంది. అయినప్పటికీ సరిపోవడం లేదు.
మొత్తానికి విద్యార్థులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. సరిగా సీట్లు దొరకకపోవడంతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచీ వస్తున్న వి ద్యార్థులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసి బస్సుల్లో వెళ్లడం ఇబ్బందిగా ఉందని ద్యార్థులు చెబుతున్నారు. నిల్చోవడం కూడా కష్టంగా ఉందని అంటున్నారు.. మంది ఎక్కువగా ఉంటే.. సరిగా ఆపడం లేదని తెలుపుతున్నారు. ప్రతి రోజూ.. బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నామని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




