AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Panchami 2025: ఈ ఏడాది నాగ పంచమి ఎప్పుడు? కాల సర్ప, నాగ దోషాల నుంచి విముక్తి కోసం ఎలా పూజించాలంటే..

హిందూ మతంలో నాగ పంచమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమి పండుగగా జరుపుకుంటారు. ఈ నాగ పంచమి రోజున సర్పాలను పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ఈ పర్వదినాన పుట్టలో పాములకు పాలు పోసి, గుడ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వలన శివుడు సంతోషిస్తాడని నమ్మకం. ఈ ఏడాది నాగ పంచమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం..

Naga Panchami 2025: ఈ ఏడాది నాగ పంచమి ఎప్పుడు? కాల సర్ప, నాగ దోషాల నుంచి విముక్తి కోసం ఎలా పూజించాలంటే..
Naga Panchami 2025
Surya Kala
|

Updated on: Jun 25, 2025 | 4:59 PM

Share

నాగ పంచమి అనేది శ్రావణ మాసంలో జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథి రోజున నాగ పంచమి వస్తుంది. ఈ నాగ పంచమి రోజున పాములను పూజిస్తారు. సర్పాలను సర్ప దేవతలకు ప్రతినిధులుగా పూజిస్తారు. హిందూ మతంలో సర్పాలను పూజనీయంగా భావిస్తారు. అలాగే శ్రావణ నెలలో సర్పాలను పూజించడం ద్వారా, శివుడు సంతోషిస్తాడు. భోలాశంకరుడు ఆశీస్సులు లభిస్తాయి. ఈ ఏడాది నాగ పంచమి ఏ రోజున వస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..

నాగ పంచమి 2025 తిథి

పంచమి తిథి జూలై 29, 2025న ఉదయం 5:24 గంటలకు ప్రారంభమవుతుంది. పంచమి తిథి జూలై 29, 2025న మధ్యాహ్నం 12.46 గంటలకు ముగుస్తుంది. అందుకే జూలై 29వ తేదీన నాగ పంచమి పండగని జరుపుకుంటారు.

2025 నాగ పంచమి ప్రాముఖ్యత

నాగ పంచమి రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ పవిత్ర పండుగ రోజున మహిళలు సర్పాలను పూజిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ రోజున పాములకు పాలు నైవేద్యం పెడతారు.

ఈ రోజున మహిళలు తమ సోదరులు, కుటుంబ సభ్యుల భద్రత కోసం కూడా ప్రార్థిస్తారు.

నాగ పంచమి రోజున పూజ మంత్రం

ఓం భుజంగేశాయ విద్మహే, సర్పరాజాయ ధీమహి, తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్”.

లేదా విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ ”

ఈ మంత్రాన్ని జపించడం వలన పాము కాటు నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. నాగ పంచమి రోజున భక్తులు పాములను పూజించి, పుట్టలో పాలు పోసి, ఈ మంత్రాన్ని జపిస్తారు.

నాగ పంచమి రోజు నాగులని పూజించి గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యంగా పెడతారు. నాగ పంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు.

నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి పాము విష భాధలు ఉండవు. సర్ప స్తోత్రాన్ని ప్రతీ రోజూ నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక రోగాలు రావు. వంశం అభివృద్ధి అవుతుంది. సంతానోత్పత్తి కలుగుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. సకల పనులు సవ్యంగా జరుగుతాయి. కాల సర్ప దోషాలు, నాగ దోషాలు తొలగి పోతాయని విష్ణువు నాగులకు ఇచ్చిన వరం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?