Jagannath Rath Rope: జగన్నాథ రథాల తాళ్ల పేర్లు ఏమిటి? రథాలను ఎవరు లాగగలరో తెలుసా..
ప్రపంచంలోని కృష్ణ భక్తులు అందరూ ఎదురు చూసే జగన్నాథ రథయాత్ర జూన్ 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దేశం, ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు జగన్నాథ పూరి ధామ్ చేరుకుంటారు. ఈ రథయాత్ర సమయంలో రథాన్ని తాడుతో లాగుతారు. అలా వీలు లేని సమయంలో కనీసం ఈ రథం కాగే తాడును తాకడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. అయితే ఈ జగన్నాథ రథయాత్ర తాడు పేరు ఏమిటి? దీనిని ఎవరు లాగగలరు? ఈ తాడుని తాకడం ద్వారా ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

ఆషాడం మాసం మొదలైంది. దీంతో పూరీ జగన్నాథ రథయాత్ర ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దేశ విదేశాల నుంచి అంటే మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు జగన్నాథ పూరి ధామ్ చేరుకుంటారు. ఈ రథయాత్రలో జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి నగర పర్యటనకు వెళతాడు. ఆ తర్వాత తన మేనత్త ఇంటికి అంటే గుండిచా ఆలయానికి వెళ్తాడు. ఇలా రథయాత్ర సమయంలో జగన్నాథుడితో పాటు బలరాముడి, సుభద్రల రథాన్ని భక్తులు లాగుతారు. ఇలా సాగే ప్రయాణంలో భారీగా భక్త జనసమూహం చేరుకుంటారు. అయితే ఇలా రథయాత్ర జరిగే సమయంలో చాలా మంది కనీసం తాడును అయినా తాకాలి అని భావిస్తారు. అయితే ఈ కోరిక కూడా తీరడం కష్టం అవుతుంది. ఎందుకంటే రథ యాత్ర సమయంలో రథాన్ని లాగడం, తాడును తాకడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. జగన్నాథ రథయాత్ర తాడు పేరు ఏమిటి? దీనిని తాకడం ద్వారా ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
రథయాత్రలో తాడు పేరు ఏమిటి?
జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలు ఆశీనులు అయ్యే మూడు రథాలకు పేర్లు భిన్నంగా ఉన్నాయి. అదే విధంగా ఆ రథాలను లాగే తాళ్ల పేర్లు కూడా భిన్నంగా ఉన్నాయి. జగన్నాథుని రథం ( 16 చక్రాల నందిఘోష), బలభద్రుని రథం (తలధ్వజ), సుభద్రమ్మ రథం (దర్పదలన). జగన్నాథుని రథాన్ని లాగే తాడును శంఖచూడుడు అని పిలుస్తారు. అయితే 14 చక్రాలు కలిగిన బలరాముడి రథం తలధ్వజ తాడును “వసూలి” అని పిలుస్తారు. మధ్యలో ఉన్న 12 చక్రాల రథం తాడును స్వర్ణుచుడ అని పిలుస్తారు.
జగన్నాథ రథం తాడును ఎవరు తాకగలరు?
పూర్తి విశ్వాసంతో పూరీకి చేరుకున్న ఏ వ్యక్తి అయినా జగన్నాథ రథం తాడును తాకవచ్చు. అతను ఏ మతం, కులం లేదా మతానికి చెందినవాడు అయినా సరే రథం తాడుని తాకవచ్చు. రథం తాళ్లను లాగేవారు జీవిత మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారని, మోక్షాన్ని పొందుతారని విశ్వాసం.
జగన్నాథ రథం తాడును తాకడం వల్ల ఏమి జరుగుతుంది?
ఈ రథయాత్రలో పాల్గొనే ప్రతి భక్తుడు రథం తాడును తాకడానికి ఆసక్తి చూపుతాడు. మత విశ్వాసం ప్రకారం రథం తాడును తాకడం వల్ల జగన్నాథుని ఆశీస్సులు లభిస్తాయి. అంతే కాదు జగన్నాథ రథం తాడును తాకడం ద్వారా వ్యక్తి తెలిసి తెలియక చేసిన అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడని, ఆ వ్యక్తి భక్తి మార్గంలో ముందుకు సాగుతాడని చెబుతారు. ఎవరైనా జగన్నాథ రథయాత్రకి వెళ్లి రథం తాడును తాకకుండా ఇంటికి తిరిగి వస్తే.. యాత్ర విజయవంతం కాదని నమ్ముతారు.
జగన్నాథ రథయాత్రలోని తాడును తాకడం చాలా ప్రయోజనకరమైనది . పుణ్యప్రదమైనదిగా పరిగణించబడుతుంది. రథం తాడును తాకడం వల్ల పాపాలు శుద్ధి అవుతాయని, జనన మరణ చక్రం నుంచి భక్తులు విముక్తి పొందుతారని చెబుతారు. అటువంటి పరిస్థితిలో ఈ రథయాత్రలో పాల్గొనడం, రథం తాడును తాకడం వల్ల జీవితంలో అదృష్టం వస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








