Kitchen Hacks: ప్రెజర్ కుక్కర్ కుక్కర్ లేకుండా పప్పులు ఉడికించేందుకు సింపుల్ టిప్స్.. మీ కోసం
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కాలంతో పోటీ పడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా కొంతమంది స్త్రీలు వంట ఇంట్లో పని చేసుకుంటూనే ఉద్యోగ బాధ్యతలను కూడా నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో తక్కువ సమయంలో సకాలంలో పని పూర్తీ చేయడానికి వంట ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ని ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం వలన సమయం, డబ్బు రెండూ అదా అవుతాయని నమ్మకం. అయితే ప్రెజర్ కుక్కర్ లో పప్పులు ఉడికించడం వలన మంచిది కాదు. కనుక కుక్కర్ లో కాకుండా పప్పులని వేగంగా ఉడికించడానికి సులభమైన మార్గాలున్నాయి. అవి ఏమిటంటే..

వంటను చాలా ఈజీగా చేసేందుకు ఎక్కువ మంది ప్రెషర్ కుక్కర్ ని తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. కుక్కర్ తక్కువ సమయంలోనే పోషకమైన, కడుపు నింపే భోజనాన్ని తయారు చేస్తుంది. మెత్తగా ఉడికించేందుకు పప్పులు, అన్నం సహా అనేక రకాల వంటలను తయారు చేసుకుంటున్నారు. అయితే కుక్కర్ లో చేసే వంటల విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కుక్కర్ లో పప్పులు ఉదికించడం అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి సమయంలో పప్పులను తక్కువ సమయంలోనే కుక్కర్ సహాయం లేకుండా ఎలా ఉడికించవచ్చునో ఈ రోజు తెలుసుకుందాం..
శనగపప్పు, కందిపప్పు, రాజ్మా వంటి పప్పులు భారతీయుల వంట గదిలో తప్పనిసరిగా ఉంటాయి. పప్పులు లేని భోజనం ఉండదంటే అతిశయోక్తికాదు. పప్పుల్లో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు నిండి ఉంటాయి. పప్పులు శాఖాహారులకు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే వారి ప్రధాన ఆహారం. అయితే ప్రెషర్ కుక్కర్ లేకుండా పప్పులను ఉడికించాలంటే అప్పుడు ఎక్కువ సమయం పడుతుందని.. పప్పులను వండటం సుదీర్ఘమైన ప్రక్రియలా అనిపిస్తుంది. అయితే పప్పులను తక్కువ సమయంలోనే సింపుల్ చిట్కాలతో ఉడికించుకోవచ్చు.
రాత్రంతా నానబెట్టండి లేదా కనీసం 6 గంటలు
పప్పుని ఉడికించే వంట సమయాన్ని తగ్గించడానికి వాటిని నానబెట్టడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇలా చేయడం వలన పప్పుధాన్యాల బయటి పొరను మృదువుగా అవుతుంది. అప్పుడు పప్పు వేగంగా ఉడికించడానికి సహాయపడుతుంది. శనగలు, రాజ్మా లేదా ఇతర గట్టి పప్పులను రాత్రంతా లేదా కనీసం 6–8 గంటల పాటు నానబెట్టండి. కంది పప్పు లేదా పెసర పప్పు వంటి పప్పులను కూడా 1–2 గంటలు నానబెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
వంట చేసేటప్పుడు వేడి నీటిని వాడండి.
పప్పులు ఉడికించే సమయంలో చల్లటి నీటిని ఉపయోగించే బదులు.. ముందుగా మరిగించిన వేడి నీటిని పప్పుని ఉడికించే పాత్రలో వేసి తర్వత పప్పుని వేయండి. ఇలా చేయడం వలన పప్పు ఉడికే ప్రక్రియ వేగవంతం అవుతుంది. పప్పు త్వరగా మెత్తగా ఉరుకుతుంది.
బేకింగ్ సోడా
పప్పుని మరిగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలపడం వల్ల పప్పులు త్వరగా మృదువుగా అవుతాయి. ఇది ముఖ్యంగా శనగలు, రాజ్మా వంటి వాటికి బాహ్య చర్మాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అయితే ఎక్కువగా బేకింగ్ సోడా వేయవద్దు.. ఆరోగ్యానికి మంచిది కాదు. అంతేకాదు పప్పులు మెత్తగా ఉదికిపోతాయి.
వంట నూనె ని ఉపయోగించండి
కంది పప్పు, పెసర పప్పు లేదా శనగలు వంటి వాటిని త్వరగా ఉడికించేందుకు వేడి నీటిలో కొంచెం వంట నూనె వేసి ఉడికించండి. ఇలా చేయడం వలన పప్పులు త్వరగా ఉడుకుతాయి. సమయం అదా అవుతుంది. రుచికరంగా ఉంటుంది. ఈ కిచెన్ హక్స్ సమయాన్ని ఆదా చేయడమే కాదు రుచికరమైన ఆరోగ్యకరమైన పప్పుతో భోజనాన్ని ఆస్వాదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








