AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌పై బిగ్ అప్‌డేట్.. ఒక్కో ఇంటికి టన్నుల్లో ఇసుక ఉచితం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం ఉన్నవాళ్ల ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బేస్మెంట్ స్లాబ్ వాల్ ఇలా నిర్మాణం దశను బట్టి 4 వాయిదాల రూపంలో నగదును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఇసుకను కూడా ఫ్రీగా చెల్లించాలని నిర్ణయించింది.

Telangana: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌పై బిగ్ అప్‌డేట్.. ఒక్కో ఇంటికి టన్నుల్లో ఇసుక ఉచితం
Indiramma Model House
Sravan Kumar B
| Edited By: |

Updated on: Jun 25, 2025 | 7:46 PM

Share

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం ఉన్నవాళ్ల ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బేస్మెంట్ స్లాబ్ వాల్ ఇలా నిర్మాణం దశను బట్టి 4 వాయిదాల రూపంలో నగదును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఇసుకను కూడా ఫ్రీగా చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఒక్కో ఇంటి నిర్మాణానికి 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను మంజూరు చేయగా.. అందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కూడా అందించారు. అందులో 1 లక్ష ఇండ్లకు గ్రౌండ్ కూడా అయిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున నాలుగున్నర లక్షల ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. హైదరాబాద్ మినహా 95 నియోజకవర్గాలకు గాను 88 నియోజకవర్గాల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. అయితే రానున్నది వర్షాకాలం కాబట్టి నిర్మాణ పనులకు ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా గ్రౌండింగ్ పనులు పూర్తిచేసి బేస్మెంట్ లెవెల్‌కి నిర్మాణం పూర్తి చేస్తే మంచిదని అధికారులు అంటున్నారు.

అయితే ప్రతి ఇంటి నిర్మాణానికి 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తుండటంతో దానికి అయ్యే ఖర్చు సుమారు 60 వేల రూపాయల వరకు లబ్ధిదారులకు అదనంగా వస్తుంది. అయితే మొత్తం ఐదు లక్షల డబ్బును నాలుగు విడతల్లో లబ్ధిదారులకు డైరెక్ట్‌గా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా వాళ్ల బ్యాంకు ఖాతాలోనే వేయడం గొప్ప విషయం. అయితే ఇప్పటివరకు కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంట్రాక్టర్లతో పూర్తి చేయించి కేటాయించాలని కాంట్రాక్టర్లకు ముందుకు రానిపక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేసివారికి ఆ ఇళ్లను కేటాయించి ఆ ఇంటి నిర్మాణ పూర్తికి అవసరమయ్యే ఐదు లక్షలు కూడా లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి