Telangana: ఫ్రెండ్స్‌తో పార్టీ అని ఓయో రూమ్‌కి వెళ్లింది.. తెల్లారి బాయ్ వచ్చి డోర్ ఓపెన్ చేయగా
ఉదయాన్నే రూమ్ క్లీనింగ్‌కు వచ్చిన సిబ్బంది.. ఓ డోర్ ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మీరూ ఓ సారి ఈ ఆర్టికల్ పై లుక్కేయండి మరి.

హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలోని ఓ ఓయో హోటల్‌లో జరిగిన యువతి ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగండ్ల ప్రాంతానికి చెందిన అనూష(26) అనే యువతి బ్యూటిషన్‌గా పని చేస్తోంది. భర్తతో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఈ మధ్య తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే ఈనెల 22వ తేదీన సాయంత్రం ఆరు గంటల సమయంలో ‘స్నేహితుల వద్దకు వెళ్తున్నాను’ అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది అనూష. అయితే రాత్రి ఆలస్యమైనప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అనూషకు ఫోన్ చేశారు. కానీ ఆమె ఫోన్ స్విచాఫ్ కావడంతో ఆందోళనకు గురయ్యారు.
ఇదిలా ఉండగా.. రాయదుర్గంలోని క్యూబిన్ ఓయో లాడ్జ్‌లో ఒక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం లాడ్జ్ సిబ్బంది నుంచి పోలీసులకు చేరింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ అనూష అని గుర్తించారు. ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అనూష మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనూషను హత్య చేసి ఆత్మహత్యగా మలిచిన అవకాశం ఉందని వారు అనుమానిస్తున్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి మృతికి కారణాలపై స్పష్టత తీసుకువస్తామని పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
