AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidura Niti: సక్సెస్ మీ సొంతం కావాలంటే.. ఈ ముగ్గురు వ్యక్తులకు వీలైంత దూరంగా ఉండండి..

మహాభారతంలో ధృతరాష్ట్రుడు, విదురుడి మధ్య జరిగిన సంభాషణను విదురు నీతిగా రూపొందించబడింది. ఈ విదుర నీతిలో జీవితంలోని వివిధ అంశాలను లోతుగా చర్చించారు. అందులో మూడు రకాల వ్యక్తుల నుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలని విదురు నీతి చెబుతుంది. ఎందుకంటే వీరు పురోగతిలో అడ్డంకిగా మారతారు. ఈ 3 రకాల వ్యక్తులు ఎవరో ఈ రోజు తెలుసుకుందాం..

Vidura Niti: సక్సెస్ మీ సొంతం కావాలంటే.. ఈ ముగ్గురు వ్యక్తులకు వీలైంత దూరంగా ఉండండి..
Vidura Niti
Surya Kala
|

Updated on: Jun 25, 2025 | 6:38 PM

Share

మహాభారతంలోని అన్ని పాత్రలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే వీరిలో విదురుడు ప్రత్యేకమైనవాడు. కురు రాజ్యంలో మహా మంత్రిగా విధులను నిర్వహించారు. వాస్తవానికి ధృతరాష్ట్రుడు, పాండు, విదురులకు ఒకే తండ్రి.. వేర్వేరు తల్లులు. అయితే విదురుడు రాజకుటుంబంలో భాగంగా పరిగణించబడలేదు. దాసీ తనయుడైన విదురుడు జీవితాంతం రాజభవనం వెలుపల నివసించడానికి ఇదే కారణం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వచ్చినప్పుడు.. శ్రీ కృష్ణుడు రాజభవనంలో కాకుండా విదురుని ఇంట్లోనే ఉన్నాడు. దీనికి ప్రత్యేక కారణం విదురుని నిష్పాక్షికత, దేవుని పట్ల భక్తి, అపారమైన జ్ఞానం. విదురుడు అంటే శ్రీకృష్ణుడు, భీష్మ పితామహులకు అమితమైన ఇష్టం. అతని జ్ఞానం, జీవనశైలి, స్వభావం కారణంగా ‘మహాత్మా విదురుడు’ అని పిలుస్తారు. విదుర నీతి ప్రకారం పురోగతి, ఆర్ధిక శ్రేయస్సు కి అడ్డంకిగా మారే ముగ్గురు వ్యక్తులకు దూరంగా ఉండాలి.

ఈ 3 వ్యక్తుల నుండి దూరం పాటించండి విదుర నీతిలో మహాత్మ విదుర జీవితాన్ని గడపడానికి అనేక విలువైన సూత్రాలను చెప్పారు. ముఖ్యమైన సూత్రాలలో ఒకటి కొంతమంది వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండటం తెలివైన పని. విదుర చెప్పిన ప్రకారం వ్యక్తీ జీవితంలో అడ్డంకులు సృష్టించగల 3 రకాల వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం మంచిదని చెప్పారు. ఇలాంటి వ్యక్తులు మీ పురోగతిలో అడ్డంకులను సృష్టిస్తారు. వీరి కారణంగా మీరు ఎల్లప్పుడూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అసూయపడే వ్యక్తులు ఇతరుల విజయాలను చూసి అసూయపడే వ్యక్తులు తరచుగా ఇతరులకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. వీరు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు లేదా మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేయవచ్చు. వాస్తవానికి, అలాంటి వారిని విదుర నీతిలో రహస్య శత్రువులు అని పిలుస్తారు. వీరు ఎవరైనా, స్నేహితులు లేదా అపరిచితులు కావచ్చు. ఆచరణాత్మక జీవితం గురించి మాట్లాడుకుంటే తరచుగా మీ ఇంటి, కుటుంబం, వంశం లేదా సమాజంలోని మీ పురోగతి, అభివృద్ధిని చూసి ఇలాంటి వారు అసూయపడి మిమ్మల్ని వెనక్కి లాగుతారు.

ఇవి కూడా చదవండి

మోసం చేసే వ్యక్తులు కొంత మంది మోసగాళ్ళు, అబద్ధాలు చెబుతారు. ఇతరులను మోసం చేస్తారు. కనుక మోసం చేసే గుణం ఉన్నవారి పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత దూరం పాటించాలి. వీరు నమ్మిన వారిని దెబ్బతీసి హాని కలిగించవచ్చు. ఇటువంటి వ్యక్తులను వారు చేసే మోసాన్ని త్వరగా గుర్తించడం సులభం కాకపోయినా.. అటువంటి వ్యక్తుల చెడు, దుర్గుణాలను దాచలేరు. మోసం చేసే గుణం ఉన్న వ్యక్తి ఎలాంటివాడో త్వరలోగా అర్థమవుతుంది.

సోమరి ప్రజలు విదుర నీతి ప్రకారం.. సోమరితనంతో పనికి చేయడానికి బద్దకించి పని చేయడం అంటే పారిపోయే వ్యక్తులు మీ జీవితంలో ప్రతికూల శక్తిని తీసుకురాగలరు. వారు మిమ్మల్ని కూడా సోమరిగా మార్చగలరు. పురోగతికి ఆటంకం కలిగించగలరు. తమ సోమరితనంతో పనిని వాయిదా వేస్తూ ఉంటారు. దీని కారణంగా ముఖ్యమైన పని కూడా సమయానికి పూర్తి కాకపోవచ్చు. భారీ నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు. సోమరితనం సమయం, శక్తిని వృధా చేయడమే కాదు జీవితంలో వైఫల్యానికి అతిపెద్ద కారణం అవుతుంది. కనుక అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం ద్వారా మాత్రమే పురోగతి బాటలో ప్రయనించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.