Telangana: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మృతి
రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధిక వేగం, ఓవర్‌టెక్, మద్యం తాగి వాహనాలు నడపడం, నిద్రమత్తు తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరోప్రాణాలు వదులుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటిహుటిన ఘనట స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు..
రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధిక వేగం, ఓవర్‌టెక్, మద్యం తాగి వాహనాలు నడపడం, నిద్రమత్తు తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరోప్రాణాలు వదులుతున్నారు. తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతులు మొహిద్దీన్ (60) మొయినుద్దీన్ (40) అలీ (8), ఉస్మానుద్దీన్ (10), ఉస్మాన్ (12) ఉన్నారు.
గుడిహత్నూర్ మండలం మేకలగండి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. మృతులంతా ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. అయితే బైంసాలో ఓ విందు కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటిహుటిన ఘనట స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి