AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Delhi Tour: ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్‌… టూర్‌ షెడ్యూల్‌ ఇదే!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అటు అధికారిక సమావేశాలతో పాటు ఇటు పార్టీ అధిష్ఠానంతో చర్చల జరపనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్ర పెద్దలతో చర్చించనున్న సీఎం రేవంత్.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ హైకమాండ్‌కు వివరించనున్నారు. ఏఐసీసీసీ అధ్యక్షుడు

Revanth Delhi Tour: ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్‌... టూర్‌ షెడ్యూల్‌ ఇదే!
Cm Revanth Reddy
K Sammaiah
|

Updated on: Jul 07, 2025 | 6:27 AM

Share

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అటు అధికారిక సమావేశాలతో పాటు ఇటు పార్టీ అధిష్ఠానంతో చర్చల జరపనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్ర పెద్దలతో చర్చించనున్న సీఎం రేవంత్.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ హైకమాండ్‌కు వివరించనున్నారు. ఏఐసీసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలంగాణ టూర్‌ తర్వాత రేవంత్‌ ఢిళ్లీ వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుంది.

సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న సీఎం రేవంత్.. రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నట్టు సమాచారం. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ భాగాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో సమావేశాలు జరపనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత ఉండటంతో కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రానికి ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేస్తారు.

ఇక రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ నెల 14న బహిరంగ సభ నిర్వహించబోతోంది ప్రభుత్వం. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నారని సమాచారం.

ఈ నెల 12 నుంచి 18వరకు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాన్ని కూడా పార్టీ నాయకత్వానికి సీఎం రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై పార్టీ నేతలతో చర్చిస్తారు సీఎం రేవంత్.