AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రేషన్ కార్డు లేని వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ప్రజాపాలన..

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు ప్రజాపాలన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరించనుంది..

Telangana: రేషన్ కార్డు లేని వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ప్రజాపాలన..
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Aug 27, 2024 | 6:24 PM

Share

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు ప్రజాపాలన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరించనుంది.. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు మంజూరు చేసేందుకు, అలాగే రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు అందించేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులును ఆదేశించారు.. సచివాలయంలో అధికారులతో పలు శాఖలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ కీలక ఆదేశాలిచ్చారు.. అంతేకాకుండా సచివాలయంలో ఆరోగ్య, మున్సిపల్ శాఖలకు సంబంధించి స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) పై సమీక్షించారు.. ఆయా శాఖల్లో అత్యవసర, ప్రాధాన్యత కలిగిన పనులను గుర్తించి వాటిపై సమీక్ష, తక్షణ నిర్ణయాలు చేయడమే “స్పీడ్” ఉద్ధేశం.. కాగా.. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.. భూబదలాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.. 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఉస్మానియా ఆస్పత్రి నిర్మించాలన్నారు.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.. గోషామహల్ పోలీస్ అకాడమీకి.. ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశారు.

ఇదిలాఉంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లాంటివి అమలు చేస్తోంది.. మరికొన్నింటిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచిస్తున్నారు..

అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం.. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన అయిదు గ్యారంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అయిదు గ్యారంటీలకు మొత్తం 1 కోటి 9 లక్షల 12 వందల 55 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12 నాటికే ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశారు..

ఈ క్రమంలోనే మరోసారి ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డు దరఖాస్తులను స్వీకరించాలని రేవంత్ ప్రభుత్వం సన్నాహాలను ప్రారంభించింది.. దీనిలో రేషన్ కార్డు, హెల్త్ కార్డు లేని వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది.. అయితే.. తెలంగాణలో 9 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదు.. ఈ క్రమంలోనే.. చాలా మందికి పెళ్లిళ్లు అవ్వడం, కుటుంబాలు పెరగడం, పిల్లల సంఖ్య పెరగడం.. మార్పులు చేర్పులు, కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు రిలీజ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్