తెలంగాణలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండావిష్కరించిన గవర్నర్.. ప్రగతి భవన్‌లో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని పల్లెపల్లెన మువ్వన్నెల జెండ రెపరెపలాడింది.

తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనం జరిగాయి. హైదరాబాద్ మహానగరంతో పాటు పల్లెపల్లెన మువ్వన్నెల జెండ రెపరెపలాడింది. రాజధాని హైదరాబాద్‌లోని పబ్లిక్‌గార్డెన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. జాతీయ జెండాను అవిష్కరించిన గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ.. ఎంతో ధైర్యంతో పోరాడి సాధించుకున్న స్వతంత్రభారతంలో.. ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నారన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకగా స్వదేశీ టీకా అభివృద్ది చేశామన్న తమిళిసై.. వ్యాక్సిన్‌లో ప్రపంచంలోనే అందరికంటే ముందుకు దూసుకెళ్తున్నామన్నారు.
అటు, ప్రగతిభవన్‌లో జరిగిన 72వ గణతంత్ర ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు అయా జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు జాతీయ జెండాను ఎగురవేసి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Read Also … Republic day 2021 Live Updates: ఘనంగా గణతంత్ర దినోత్సవం.. తెలంగాణలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
