Telangana: బాలిక హాస్టల్లో ఎలుకలు స్వైర విహారం.. తొమ్మిది విద్యార్థులను కరిచిన ఎలుకలు
కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలను ఎలుకలు కరిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులు పడుకున్న సమయంలో ఎలుకలు వచ్చి 9మంది విద్యార్థులను కరిచాయి. అయితే వెంటనే విద్యార్థులు విషయాన్ని ఎస్ ఓ మాధవికి తెలియజేయగా విషయాన్ని బయటకి పొక్కకుండా పిహెచ్ సీ కి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు సమాచారం.

కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలను ఎలుకలు కరిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులు పడుకున్న సమయంలో ఎలుకలు వచ్చి 9మంది విద్యార్థులను కరిచాయి. అయితే వెంటనే విద్యార్థులు విషయాన్ని ఎస్ ఓ మాధవికి తెలియజేశారు. ఈ విషయం బయటకి పొక్కకుండా పిహెచ్ సీ కి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు సమాచారం. అయితే విషయం బయటికి రావడంతో ఎంఈఓ లక్ష్మీనారాయణ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలకు వచ్చి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వైద్య బృందం వచ్చి విద్యార్థులకు మరోసారి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.. తరుచు ఎలుకలు గాయపర్చడం తో విద్యార్థులు భయపడుతున్నారు. హాస్టల్లో ఎటు చూసినా ఎలుకలు సంచారిస్తున్నాయి. ఎలకల భయం తో హాస్టల్లో ఉండాలంటే భయపడుతున్నారు విద్యార్థినిలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








