ప్రాణం తీసిన అతి వేగం.. చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం..
కర్నూల్ బస్సు ప్రమాదం మరువక ముందే మరో విషాదకర వార్త ఇది. చేవెళ్లలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో సురక్షితంగా ప్రయాణిస్తున్న వారిపైకి మృత్యు శకటంలా దూసుకొచ్చింది లారీ. ఏం జరుగుతుందో తెలిసేలోపే.. ప్రాణాలుపోయాయి. టర్నింగ్ పాయింట్.. ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపింది.

కర్నూల్ బస్సు ప్రమాదం మరువక ముందే మరో విషాదకర వార్త ఇది. చేవెళ్లలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో సురక్షితంగా ప్రయాణిస్తున్న వారిపైకి మృత్యు శకటంలా దూసుకొచ్చింది లారీ. ఏం జరుగుతుందో తెలిసేలోపే.. ప్రాణాలుపోయాయి. టర్నింగ్ పాయింట్.. ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపింది. అతివేగమే ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. టిప్పర్ లారీలోని కంకరే ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. కంకర ఒక్కసారిగా మీద పడటంతో.. ప్రయాణికులు ఎక్కువమంది చనిపోయారు. పది మందికిపైగా కంకర కిందే సమాధి అయ్యారు. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. మృతుల్లో 18 మంది ప్రయాణికులు, ఇద్దరు బస్సు, టిప్పర్ డ్రైవర్లు ఉన్నారు. ఏడాది పాప సహా 11 మంది మహిళలు, 9మంది పురుషులు మృతి చెందారు. 24 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తాండూరు డిపో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనతో చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో జేసీబీతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలం దగ్గర ప్రమాదకర మలుపు ఉంది. ఓవర్ స్పీడ్‌తో వచ్చిన టిప్పర్.. వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి చెందారు. ఘటనాస్థలానికి అధికారులు వెళ్లాలని సీఎం ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని , అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్. ఈ సంఘటనపై అధికారులతో మాట్లాడిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సును రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చిన టిప్పర్ డీకొట్టినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని ఆదేశించారు.
