AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి ప్రేమ అంటే ఇదేనేమో.. కళ్ల ముందే చనిపోయిన లేగ దూడ.. తల్లడిల్లిన తల్లి ప్రాణం!

రేబిస్ వ్యాధితో లేగ దూడ ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ మృతితో తల్లి ఆవు తల్లడిల్లింది. మృతి చెందిన దూడను ఎడ్ల బండిలో తరలిస్తుండగా.. తల్లి ఆవుతో పాటు మిగిలిన గోవులు సైతం పరుగులు పెట్టాయి. తల్లి ప్రేమను చాటిచెప్పిన మూగజీవాలను చూసిన జనం కళ్లు చెమ్మగిల్లాయి. తల్లి అవుతోపాటు తోటి గోవులు స్మశాన వాటికకు వెళ్లడం గమనార్హం.

తల్లి ప్రేమ అంటే ఇదేనేమో.. కళ్ల ముందే చనిపోయిన లేగ దూడ.. తల్లడిల్లిన తల్లి ప్రాణం!
Calf Death
Diwakar P
| Edited By: |

Updated on: Nov 03, 2025 | 10:24 AM

Share

రేబిస్ వ్యాధితో లేగ దూడ ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ మృతితో తల్లి ఆవు తల్లడిల్లింది. మృతి చెందిన దూడను ఎడ్ల బండిలో తరలిస్తుండగా.. తల్లి ఆవుతో పాటు మిగిలిన గోవులు సైతం పరుగులు పెట్టాయి. తల్లి ప్రేమను చాటిచెప్పిన మూగజీవాలను చూసిన జనం కళ్లు చెమ్మగిల్లాయి.

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో రామాలయం కు చెందిన ఓ లేగ దూడ కుక్క కాటుకు గురై రేబిస్ వ్యాధితో మృతి చెందింది. తన లేగ దూడ కళ్ళముందే చనిపోవడంతో తల్లి ఆవు అంబా అంటూ రోదించడం పలువురిని కలిచి వేసింది. మృతి చెందిన లేగ దూడను ఎడ్లబండిపై స్మశాన వాటికకు తరలిస్తుండగా తల్లి ఆవు ఎడ్ల బండిని అనుకరించింది. తల్లి అవుతోపాటు తోటి గోవులు స్మశాన వాటికకు వెళ్లడం గమనార్హం.

లేగ దూడ మరణంపై గోవులు చూపిన సానుభూతి, అనురాగం ప్రేమను స్థానికులు గమనించి భావోద్వేగానికి గురయ్యారు. తల్లి ప్రేమ అంటే ఏమిటో చూపిన గోవులను చూసి మనుషులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు