Telangana Rains: భారీ వర్షం.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు

నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. మంగళవారం వేకువజాము నుంచి నాన్ స్టాప్‌గా వాన కుమ్మేస్తుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. మరోవైపు వాతావరణశాఖ హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

Telangana Rains: భారీ వర్షం.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు
Students
Follow us

|

Updated on: Aug 20, 2024 | 8:23 AM

జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. మరో రెండు గంటలపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శామీర్ పేట్, హకీంపేట్, శంషాబాద్, హయత్ నగర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు.  నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో పాటు.. 5 నుంచి 10 సెంటీమీటర్ల లోపు వర్షం పడొచ్చని సూచించింది.

మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల, వనపర్తి, నల్గొండ, జనగామ, హన్మకొండ, సిద్దిపేటకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో పాటు.. 1 నుంచి 5 సెంటీమీటర్ల లోపు వర్షం పడొచ్చని సూచించింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు గ్రీన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణవాఖ. వరంగల్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లోనూ ఎటువంటి వర్షాలుండవని గ్రీన్ అలర్ట్ ఇచ్చింది.

కాగా మంగళవారం ఉదయం వరకు యూసుఫ్‌గూడలో అత్యధికంగా 12 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. రాజేంద్రనగర్‌లో 11.4 సెం.మీ, వెస్ట్‌మారేడ్‌పల్లి 10.9, ఫలక్‌నుమా 10.6 సెం.మీ, ఉప్పల్ 10.4, గోల్కొండ 10.3 సెం.మీ…ఎల్బీనగర్‌ 10.2, నాంపల్లిలో 10 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షాల నేపథ్యంలో GHMC అలర్ట్ అయింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని పౌరులకు సూచించింది.  డీఆర్‌ఎఫ్‌ బృందాలు యాక్షన్‌లోకి దిగాయి. వర్షాలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. టోల్‌ఫ్రీ నెంబర్లు 040-2 1111 111, 9000113667కు సందప్రదించాలని GHMC సూచించింది.

స్కూళ్లకు సెలవులు…

భారీ వర్షాలతో.. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి పరిధిలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని డీఈఓ, ఎంఈఓలకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి పరిధిలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కూడా స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..