Rain Alert: తెలంగాణలో ఆరెంజ్‌ అలెర్ట్‌.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Sep 04, 2021 | 4:55 PM

Orange Alert in Telangana: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు ఇప్పటికే

Rain Alert: తెలంగాణలో ఆరెంజ్‌ అలెర్ట్‌.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు..
Rain Alert

Orange Alert in Telangana: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయంలోనే ఉన్నాయి. తరుణంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. ఈమేరకు రానున్న 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఆరెంజ్ అలెర్ట్, అతర్వాతి 4 రోజులు యెల్లో అలెర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ములుగు జిల్లా, వెంకటాపురం లో 11 సే.మీ వర్షపాతం నమోదవగా.., సంగారెడ్డి జిల్లా, జోగిపేట, పెద్దపల్లి జిల్లాలో 9 సే.మీ , కోమరంభీం జిల్లా, దహేగావ్లో 8 సే.మీ , ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 7 సే.మీ, మిగతా జిల్లాలో 3 నుంచి 6 సే.మీ వర్షపాతం నమోదయినట్లు తెలిపింది.

బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని దీని ప్రభావంతో ఈనెల 6వ తేదీ నుంచి 12లోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ స్పష్టంచేసింది. రుతుపవనాల కదలికలు సాధారణంగానే ఉన్నాయని.. కానీ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం, ఆదివారం అతి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

కాగా.. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో శ‌నివారం మ‌ధ్యాహ్నం భారీ వ‌ర్షం కురిసింది. మీర్‌పేట‌, బీఎన్ రెడ్డి న‌గ‌ర్, వనస్థలిపురం, కోఠి, అబిడ్స్, గోల్కొండ‌, కార్వాన్, లంగ‌ర్‌హౌస్, మెహిదీప‌ట్నం, అంబ‌ర్‌పేట‌, గోల్నాక‌, కాచిగూడ‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతోపాటు ముసారంగ్‌బాగ్‌ వంతెన కూడా నీట మునిగింది.

Also Read:

ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌పై విద్యార్థి అఘాయిత్యం.. మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఆపై వీడియోలు తీసి..

Crime: సోషల్‌ మీడియాలో యువకుడి వెకిలిచేష్టలు.. మహిళగా నటిస్తూ.. అమ్మాయిలను ఏం చేస్తున్నాడంటే..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu