ఈ నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ (2021-22) విడుదల అయ్యింది. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ ఈ క్యాలెండర్ రిలీజ్ చేశారు. 2022 ఏప్రిల్ 23 పాఠశాలల చివరి పని దినంగా నిర్ణయించారు. ఈ ఏడాది 213 పాఠశాలల వర్కింగ్ డేస్ ఉంటాయి. 47 రోజులు ఆన్లైన్ ద్వారా, 166 రోజులు ప్రత్యేక తరగతులు ద్వారా క్లాసెస్ నిర్వహణ ఉంటుంది. ఫార్మేటివ్ అసెస్‌మెంట్1 పరీక్షలు.. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతాయి. సమ్మేటివ్ అసెస్‌మెంట్1 పరీక్షలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు జరుగుతాయి. ఫార్మేటివ్ అసెస్‌మెంట్2 పదవ తరగతి పరీక్షలు జనవరి 31 నుంచి స్టార్టవుతాయి. ఫార్మేటివ్ అసెస్‌మెంట్2 పరీక్షలు ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమవుతాయి. సమ్మేటివ్ అసెస్‌మెంట్2 పరీక్షలు 1 నుండి 9 వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుండి18 వరకు జరగనున్నాయి. ఇక పదో తరగతి విద్యార్థులకు 2022, జనవరి 10వ తేదీ నాటికి సిలబస్ పూర్తి చేయాలని అధికారులు పేర్కొన్నారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ ఫిబ్రవరి 25 లోపు ఉంటుంది. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు దసరా సెలవులు 12 రోజులపాటు ప్రకటించారు. జనవరి 11 నుండి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి.
దసరా సెలవులు : 06.10.2021 to 17.10.2021 (12 రోజులు ) క్రిస్మస్ సెలవులు : 22.12.2021 to 28.12.2021 (7 రోజులు ) సంక్రాంతి సెలవులు : 11.01.2022 to 16.01.2022 (6 రోజులు ) వేసవి సెలవులు : 24.04.2022 to 12.06.2022
Also Read: హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు