నాగార్జున సాగర్‌లో ఇచ్చిన ఆ ఎన్నికల హామీ ఏమయ్యింది? కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్న

MP Komatireddy Venkatreddy: సీఎం కేసీఆర్ అనేక సార్లు దళితులను మోసం చేశారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ మరోసారి దళితులను మాయమాటలతో నమ్మించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

నాగార్జున సాగర్‌లో ఇచ్చిన ఆ ఎన్నికల హామీ ఏమయ్యింది? కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్న
Komatireddy Venkat Reddy

MP Komatireddy Venkatreddy: సీఎం కేసీఆర్ అనేక సార్లు దళితులను మోసం చేశారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ మరోసారి దళితులను మాయమాటలతో నమ్మించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే దళిత అంశాన్ని కేసీఆర్ వాడుకుంటున్నారని అన్నారు.  సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్త శుద్ధి ఉంటే దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని నియోజక వర్గాల్లో దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్బంగా 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఆరు నెలలు గడిచినా.. దాని ఊసే ఎత్తడం లేదన్నారు. హుజూరాబాద్ ఎన్నికల వేళ హామీల వర్షం కురిపిస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు,నిరుద్యోగులు, సర్పంచులు కూడా ఆత్మ హత్య చేసుకునే దుస్థితి నెలకొంటోందని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నాయకులకు సంపాదన మీద ఉన్న శ్రద్ధ, ప్రజా శ్రేయస్సు మీద లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిపైన విచారణ జరిపిస్తామని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు.

Also Read..

Sunitha Upadrashta: ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్నా.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత

Modi America Tour: ప్రధాని మోడీ అమెరికా పర్యటన.. బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు.. ఎప్పుడంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu