బయటకు వెళ్లాలనుకుంటే వెళ్ళండి.. ఎంపీ కోమటిరెడ్డిపై మధుయాష్కీ ఘాటు వ్యాఖ్యలు

వైఎస్సార్ వర్థంతినాడు విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదు...రాజకీయ సమ్మేళనమంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు.

బయటకు వెళ్లాలనుకుంటే వెళ్ళండి.. ఎంపీ కోమటిరెడ్డిపై మధుయాష్కీ ఘాటు వ్యాఖ్యలు
Madhu Yashki Goud(File Photo)

వైఎస్సార్ వర్థంతినాడు విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదు…రాజకీయ సమ్మేళనమంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్, షర్మిలలు ఎదిగిన కాంగ్రెస్ కొమ్మని నరకాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జీవిత లక్ష్యం రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడమేనని గుర్తుచేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా చేతిలో ఉండి పని చేస్తే వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదుగుదల అయినా.. తన ఎదుగుదల అయినా.. సోనియా గాంధీ వల్లనే అన్నారు. పార్టీ నిర్ణయాన్ని కాదని విజయమ్మ ఆత్మీయ సమ్మేళనంకు ఎంపీ కోమటిరెడ్డి వెళ్లడం పార్టీని నష్టపరచడమేనని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతమైతే విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంకు వైఎస్ జగన్ ఎందుకు హాజరుకాలేదన్నారు. తండ్రి ఆత్మీయ సమ్మేళనంకి రాని కొడుకు ఉంటారా? అని మధుయాష్కీ ప్రశ్నించారు.

వైఎస్ బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని విజయమ్మ వ్యాఖ్యానించారని.. ఆమె వ్యాఖ్యలను కోమటిరెడ్డి సమర్ధిస్తారా? అని మధుయాష్కీ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు… బయటకు పోవాలని అనుకుంటే పోవచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లాలని అనుకుంటే వెళ్ళండి.. కానీ వెన్నుపోటు పొడవద్దన్నారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజకీయ వేదిక మీదకు వెళ్లి మాట్లాడటం పార్టీకి నష్టమేనన్నారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలా.. వద్దా అనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. సీతక్క చంద్రబాబుకు రాఖీ కట్టడం కూడా రాజకీయం చేయడం జ్ఞానం లేని వారు చేసే పనిగా ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్, ప్రధాని మోడీతో భేటీ కావడం.. దొంగలు దొంగలు ఉర్లు పంచుకున్నట్టు ఉందని మధుయాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. కేసుల నుండి బయట పడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల మీద ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని మధుయాష్కీ ప్రశ్నించారు.

Also Read..

Kadapa District: మర్యాదలు తక్కువ అయ్యాయని మండపం నుంచి వెళ్లిపోయిన పెళ్లి కూతురు

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..

Click on your DTH Provider to Add TV9 Telugu