AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఉమ్మడి జిల్లా మీదుగా రెండు కొత్త రైల్వే లైన్లు..!

Nalgonda: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, కిషన్‌రెడ్డి ఈ కొత్త రైల్వేలైన్‌ ప్రతిపాదనను ప్రకటించారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఈ లైన్‌లకు నిధులు మంజూరు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులన్ని..

Telangana: ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఉమ్మడి జిల్లా మీదుగా రెండు కొత్త రైల్వే లైన్లు..!
Indian Railways
M Revan Reddy
| Edited By: |

Updated on: Oct 04, 2023 | 10:45 AM

Share

ఉమ్మడి నల్గొండ, అక్టోబర్04: 

తెలుగు రాష్ట్రాల విభజన హామీలపై కేంద్ర రైల్వే శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా శంషాబాద్‌ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్‌ వరకు హైస్పీడ్‌ రైల్వేలైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. దీనికోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వేకు రైల్వేబోర్డు అనుమతులు మంజూరు చేస్తూ తీపికబురు అందించింది. ఈ రైల్వే లైన్ పై కాంట్రాక్టర్ ఆరు నెలల్లో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ ప్రాథమికంగా శంషాబాద్‌ నుంచి 65వ నంబర్‌ హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారికి సమాంతరంగా ఈ లైన్ వేయనున్నారు. 220 కి.మీ. వేగంతో సెమీ హైస్పీడ్‌ రైళ్లను నడిపేవిధంగా ఈ లైన్‌ వేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైల్వే లైన్ వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌, చిట్యాల, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ పట్టణాల మీదుగా ఈ లైన్‌ వెళ్లనుంది.

డోర్నకల్‌–గద్వాల మార్గం..

ఇప్పటికే డోర్నకల్‌– మిర్యాలగూడ మార్గానికి సంబంధించి బ్రాడ్‌గేజ్‌ లైన్ సర్వే చివరి దశలో ఉంది. ఈ లైన్‌ డోర్నకల్‌, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్‌నగర్‌ల మీదుగా మిర్యాలగూడకు చేరుకోనుంది. ఈ లైన్ ను జాన్‌పహాడ్‌ వద్ద అనుసంధానం చేసే విధంగా తయారు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందించారు. డోర్నకల్ నుంచి పాలేరు, సూర్యాపేట మీదుగా గద్వాల్ వరకు 296 కిలోమీటర్లతో మరో రైల్వే లైన్ ను కేంద్రం మంజూరీ చేసింది. దక్షిణ తెలంగాణను కలిపే ఈ లైన్ డోర్నకల్ నుంచి ఖమ్మం, కుసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్‌, వనపర్తి మీదుగా గద్వాల వరకు నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్లతో హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, దిల్లీ మార్గాలతో అదనపు అనుసంధానం ఏర్పడనుంది.  YTPS పవర్ ప్లాంట్ కు అవసరమయ్యే బొగ్గును సింగరేణి కాలరీస్‌ నుంచి సులభంగా రవాణా చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ధాన్య బండాగారానికి కేంద్ర బిందువుగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లుల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు బియ్యం రవాణాకు ట్రన్స్‌పోర్టు చేసేందుకు ఎంతో ఉపయోగపడింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, కిషన్‌రెడ్డి ఈ కొత్త రైల్వేలైన్‌ ప్రతిపాదనను ప్రకటించారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఈ లైన్‌లకు నిధులు మంజూరు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులన్ని కార్యరూపం దాల్చితే ఉమ్మడి జిల్లా వాసులకు మరికొన్ని రైళ్లు, వాణిజ్య రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..