AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఫోన్ 13 డ్యామేజ్ అయినందుకు రూ.1 లక్ష పరిహారం పొందిన బెంగళూరు వ్యక్తి! అవును నిజమే..!!

కానీ, అతనికి ఎటువంటి సమాధానం రాలేదు. డిసెంబరులో అతడు మరోమారు స్థానిక జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో నగరంలోని వినియోగదారుల న్యాయస్థానం అతడి పిటిషన్‌పై విచారణ జరిపి తాజాగా యాపిల్‌కు పరిహారంగా రూ.79,900, వడ్డీతో పాటు అదనంగా రూ.20వేలు చెల్లించాలని ఆదేశించింది. మొబైల్ ఫోన్ కోసం ఓ వ్యక్తికి లక్ష రూపాయలు చెల్లించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఐఫోన్ 13 డ్యామేజ్ అయినందుకు రూ.1 లక్ష పరిహారం పొందిన బెంగళూరు వ్యక్తి! అవును నిజమే..!!
Iphone
Jyothi Gadda
|

Updated on: Oct 04, 2023 | 10:21 AM

Share

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన యాపిల్ పరికరం పాడైపోయినందుకు యాపిల్ ఇండియా సర్వీస్ సెంటర్ నుంచి రూ.లక్ష పరిహారం అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త యాపిల్ ప్రియులను, వీక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అవును, ప్రతి ఒక్కరూ ఫోన్ సర్వీస్ పొందడానికి సమీపంలోని మొబైల్ దుకాణానికి వెళతారు. కానీ యాపిల్ కంపెనీ డ్యామేజ్ అయిన మొబైల్ ఫోన్ కోసం ఓ వ్యక్తికి లక్ష రూపాయలు చెల్లించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల అవాజ్ ఖాన్ అనే వ్యక్తి ఫ్రేజర్ టౌన్ నివాసి. ఈ వ్యక్తికి ఐఫోన్ 13 ఉంది. అతను ఒక సంవత్సరం వారంటీతో అక్టోబర్ 2021లో iPhone 13ని కొనుగోలు చేశాడు. కొన్ని నెలల తర్వాత ఫోన్ బ్యాటరీ, స్పీకర్‌తో తరచూ ఏదో ప్రాబ్లమ్‌ రావటం మొదలైంది. ఆగస్టు 2022లో, అతడు సహాయం కోరుతూ ఇందిరానగర్‌లోని యాపిల్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లాడు. ఫోన్‌ను సర్వీస్ సెంటర్‌లో రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఒక వారం సమయం కావాలని చెప్పారు. దానికి అతడు సరే అని ఒప్పుకున్నాడు.

తిరిగి ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లగా, ఐఫోన్ ఇంకా పనిచేయటం లేదని తెలిసింది. మళ్లీ అక్కడే ఫిర్యాదు చేసి పరిష్కరించాలని కోరాడు. తరువాత, పరికరం బయటి మెష్‌లో జిగురు లాంటి పదార్థం కనిపించదని వారికి చెప్పాడు..అయితే దీన్ని సరిచేయడానికి కంపెనీ ఇచ్చిన వారంటీ వర్తించదని కస్టమర్‌కేర్‌ నిర్వాహకులు తేల్చి చెప్పారు. దాంతో అతడు అక్టోబర్ 2022లో సదరు కంపెనీకి లీగల్ నోటీసు పంపాడు. కానీ, అతనికి ఎటువంటి సమాధానం రాలేదు. డిసెంబరులో అతడు మరోమారు స్థానిక జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో నగరంలోని వినియోగదారుల న్యాయస్థానం అతడి పిటిషన్‌పై విచారణ జరిపి తాజాగా యాపిల్‌కు పరిహారంగా రూ.79,900, వడ్డీతో పాటు అదనంగా రూ.20వేలు చెల్లించాలని ఆదేశించింది.

ఇకపోతే, ఇప్పుడు iPhone 13..కొనుక్కోవాలని భావిస్తున్న వారికి గొప్ప శుభవార్త నందుతుంది. తక్కువ ధరకే ఇప్పుడు మీకు యాపిల్ ఐఫోన్‌ అందుబాటులోకి వస్తోంది. ఐ-ఫోన్ 13 ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌తో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2023 అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.40 వేలలోపే లభించనుంది. ఈ నెల 8వ తేది నుంచి అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..