AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father on Sale!: వార్నీ.. చిన్నారి కాదు.. చిచ్చర పిడుగు..! 8 ఏళ్లకే నాన్నను అమ్మకానికి పెట్టి..?

సోషల్ మీడియాలో ఈ నోటీసును చదివిన తర్వాత, వినియోగదారులు ఫన్నీ రియాక్షన్స్‌ ఇస్తున్నారు. స్మైలీ, ఫన్నీ ఎమోజీలతో రీ ట్విట్‌ చేస్తున్నారు. ఒకరు..ఈ రోజు నేను ఇంటర్నెట్‌లో చూసిన హాస్యాస్పదమైన విషయం ఇదేనంటూ కామెంట్‌ చేయగా, ఒక్కక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే Xలో ఈ చిత్రాన్ని..

Father on Sale!: వార్నీ.. చిన్నారి కాదు.. చిచ్చర పిడుగు..! 8 ఏళ్లకే నాన్నను అమ్మకానికి పెట్టి..?
Father On Sale
Jyothi Gadda
|

Updated on: Oct 04, 2023 | 8:00 AM

Share

నేటి కాలంలో పిల్లలు వారి తెలివితేటలు, సామర్థ్యం, సృజనాత్మకతతో పెద్దలను మించిపోయారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఉదాహరణలు చాలానే కనిపిస్తున్నాయి. ఇటీవల అలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ చిన్నారి తన తండ్రిని రెండు లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు ఇంటి బయట నోటీసు పెట్టింది. సోషల్ మీడియాలో ఈ నోటీసును చదివిన వినియోగదారులు వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. Melanchoholic అనే వినియోగదారు Xలో ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన ఫోటోను షేర్‌ చేసారు. ఇందులో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి తన తండ్రిపై కోపంతో అతన్ని అమ్మేందుకు వేలం వేసింది. తమ ఇంటి తలుపు మీద “ఫాదర్ ఆన్ సేల్” అని నోటీసును అంటించింది. తన తండ్రిని రెండు లక్షల రూపాయలకు అమ్ముతున్నానని, ఎవరైనా కొనాలనుకుంటే ఇంటి బెల్ కొట్టి తనను సంప్రదించవచ్చని కూడా రాసింది ఆ చిన్నారి. ప్రస్తుతం ఈ నోటీస్ విపరీతంగా వైరల్ అవుతోంది.

తన తెలివైన కూతురు రాసిన నోటీసును ఓ తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ చిత్రం ఆన్‌లైన్‌లో హద్దులు లేకుండా వైరల్‌ అవుతోంది.ఎనిమిదేళ్ల చిన్నారి తన తండ్రిని రూ. 2 లక్షలకు అమ్ముతున్నట్లు తన ఇంటి బయట నోటీసు పెట్టటం చూసి సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తండ్రిని అమ్మకానికి పెట్టిన ఆ చిన్నారి తెలివికి వినియోగదారులు వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

@Malatweets అనే X వినియోగదారు తన 8 ఏళ్ల కుమారు చేతితో రాసిన పోస్టర్ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ నోటీస్‌పై “ఫాదర్ ఆన్ సేల్” అని రాసి ఉంది.తన తండ్రిని రెండు లక్షల రూపాయలకు అమ్ముతున్నానని, ఎవరైనా కొనాలనుకుంటే ఇంటి బెల్ కొట్టి తనను సంప్రదించవచ్చని కూడా రాశాడు. సోషల్ మీడియాలో ఈ నోటీసును చదివిన తర్వాత, వినియోగదారులు ఫన్నీ రియాక్షన్స్‌ ఇస్తున్నారు. స్మైలీ, ఫన్నీ ఎమోజీలతో రీ ట్విట్‌ చేస్తున్నారు. ఒకరు..ఈ రోజు నేను ఇంటర్నెట్‌లో చూసిన హాస్యాస్పదమైన విషయం ఇదేనంటూ కామెంట్‌ చేయగా, ఒక్కక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే Xలో ఈ చిత్రాన్ని 25 వేల మందికి పైగా చూడగా, వందల మంది దీన్ని లైక్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..