AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ ఈ పదార్థం తింటే గుండెపోటు రాదు! వైద్యులు స్వయంగా చేసిన ప్రయోగం ఇది..!

మీరు మీ గుండెను అన్ని వ్యాధుల నుండి రక్షించుకోవాలనుకుంటే, ప్రతిరోజూ వేయించిన శనగలు తినండి. దీన్ని తినడం వల్ల మీ గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. కాల్చిన శనగలలో ఉండే మాంగనీస్, ఫాస్పరస్, ఫోలేట్, కాపర్ రక్త ప్రసరణను నిర్వహిస్తాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

రోజూ ఈ పదార్థం తింటే గుండెపోటు రాదు! వైద్యులు స్వయంగా చేసిన ప్రయోగం ఇది..!
Roasted Chana
Jyothi Gadda
|

Updated on: Oct 03, 2023 | 2:05 PM

Share

మీరు కూడా గుండెపోటు భయంతో బాధపడుతున్నారా? మీరు సాధారణ ఒత్తిడితో పనిచేస్తున్నారా..? కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీ జీవనశైలిలో సాధారణ మార్పులు చేసుకోండి. ఈ రోజు నుండి మీ రెగ్యులర్ రొటీన్‌లో ఈ పదార్థాన్ని తప్పక తినండి. అది మరేంటో కాదు. వేయించిన శనగలు.. అవును మీరు చదివింది నిజమే.. వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంది శనగలను నానబెట్టి, మొలకల రూపంలో అనేక ఇతర మార్గాల్లో తింటారు. మన పూర్వీకులు కొన్నేళ్లుగా బెల్లం, శనగలు తింటారు. ఆ సమయంలో గుండెజబ్బులు చాలా అరుదుగా వచ్చేవి. ఆయుర్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఇక పెద్ద పెద్ద డాక్టర్లు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. గుర్రం పప్పును తింటుంది కాబట్టి, అది చాలా శక్తిని కలిగి ఉంటుంది. నిరంతరం నడుస్తుందని అంటారు. అదేవిధంగా, మీరు క్రమం తప్పకుండా వేయించిన వేయించిన శనగలు తింటే మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

వేయించిన శనగలు శరీరానికి దివ్యౌషధం:

వేయించిన శనగలు శరీరానికి దివ్యౌషధం. వేయించిన శనగలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీ రోగనిరోధక వ్యవస్థ మరింత మెరుగవుతుంది. వేయించిన శనగలు గుండెపోటును నివారిస్తుంది.. రోజూ వేయించిన శనగలు తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతో పాటు గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిజానికి, వేయించిన శనగలలో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, కాల్షియం, ఐరన్, ఫోలేట్, ఫాస్పరస్, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ముఖ్యమైన పోషకాలన్నీ శరీరానికి అవసరం. దాని వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడం-

వేయించిన శనగలు బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. దీన్ని బరువు తగ్గించే ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు. వేయించిన శనగలు తినడం ద్వారా, మీకు ఎక్కవ సమయం వరకు ఆకలి వేయదు. ఆకలిని మందగిస్తుంది. దీంతో మీ తిండి కంట్రోల్‌ అవుతుంది. బరువు తగ్గడం ప్రారంభిస్తారు. దీంతో పాటు వేయించిన శనగలు కూడా జీర్ణ శక్తిని బలపరుస్తుంది.

రక్తపోటు-

శనగలలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనితో పాటు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వేయించిన శనగలలో రాగి, మాంగనీస్, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దీని కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

మంచి గుండె ఆరోగ్యం-

మీరు మీ గుండెను అన్ని వ్యాధుల నుండి రక్షించుకోవాలనుకుంటే, ప్రతిరోజూ వేయించిన శనగలు తినండి. దీన్ని తినడం వల్ల మీ గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. కాల్చిన శనగలలో ఉండే మాంగనీస్, ఫాస్పరస్, ఫోలేట్, కాపర్ రక్త ప్రసరణను నిర్వహిస్తాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!