AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cashew Nut Chutney: అమ్మచేతి కమ్మని వంట.. టేస్టీ టేస్టీ జీడిపప్పు పచ్చడి.. రెసిపీ మీ కోసం..

గోదావరి జిల్లా వాసుల సీఫుడ్, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళతో పాటు టిఫిన్స్ కూడా అందరిని ఆకర్షిస్తాయి. ఇష్టంగా తింటారు. ఇడ్లి, దోశలు వంటి టిఫిన్స్ లో రెగ్యులర్ పచ్చళ్ళను తిని బోర్ కొట్టినవారు డిఫరెంట్ పచ్చడిని ట్రై చేయాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జీడిపప్పు పచ్చడి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

Cashew Nut Chutney: అమ్మచేతి కమ్మని వంట.. టేస్టీ టేస్టీ జీడిపప్పు పచ్చడి.. రెసిపీ మీ కోసం..
Cashew Chutney
Surya Kala
|

Updated on: Oct 03, 2023 | 1:00 PM

Share

భారతీయులు ఆహార ప్రియులని ప్రపంచ ఖ్యాతి. భిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు భారతీయుల సొంతం. రోటీలు, అన్నం, కూరలు,పచ్చళ్లు, పులుసు వంటి అనేక రకాల ఆహారపదర్ధాలతో తమ భోజనాన్ని తినడానికి ఇష్టపడతారు. అయితే దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగువారి ఆహారపు అభిరుచి అందరినీ ఆకట్టుకుంటుంది. మర్యాదకు మన్ననకు పుట్టింటి పేరైన గోదావరి జిల్లా వాసుల సీఫుడ్, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళతో పాటు టిఫిన్స్ కూడా అందరిని ఆకర్షిస్తాయి. ఇష్టంగా తింటారు. ఇడ్లి, దోశలు వంటి టిఫిన్స్ లో రెగ్యులర్ పచ్చళ్ళను తిని బోర్ కొట్టినవారు డిఫరెంట్ పచ్చడిని ట్రై చేయాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జీడిపప్పు పచ్చడి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

జీడిపప్పు పచ్చడికి కావాల్సిన పదార్ధాలు:

జీడిపప్పు- పచ్చడికి కావాల్సినవి(50 గ్రాములు)

చింత పండు – పులుపుకి సరిపడా

ఇవి కూడా చదవండి

పచ్చి మిర్చి లేదా ఎండు మిర్చి  – కారానికి సరిపోయే విధంగా (4 లేదా 5)

ఉప్పు – రుచికి సరిపడా

నూనె లేదా నెయ్యి – మూడు గరిటెలు

బెల్లం – కొంచెం

జీలకర్ర- అర స్పూను

పోపు కోసం కావాల్సిన పదార్ధాలు:

ఎండుమిర్చి – కొన్ని ముక్కలు

ఆవాలు – కొంచెం

జీలకర్ర – కొంచెం

కరివేపాకు – కొంచెం

వెల్లుల్లి – రెండు రెమ్మలు

ఇంగువ – కొంచెం

పచ్చడి తయారీ విధానం:

ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె లేదా నెయ్యి వేసి వేడి ఎక్కిన తర్వాత జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని అదే నూనెలో ఎండు మిర్చి, జీలకర్ర వేయించుకుని దింపే ముందు చింత పండు వేసి వేడి ఎక్కిన తర్వాత వాటిని తీసుకుని చల్లారబెట్టుకోవాలి. మిక్సీ తీసుకుని వేయించిన ఎండు మిర్చి, చింత పండు, జీలకర్ర, వేసి మిక్సీ పట్టుకుని తర్వాత జీడిపప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

అనంతరం బాణలిలో నూనె వేసి .. అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి, వెల్లుల్లి పోపు దినుసులు వేసి వేయించి.. కొంచెం ఇంగువ వేసి వేయించి గిన్నెలో తీసుకున్న పచ్చడిలో తిరగమోత వేయాలి. అంతే ఈజీ టేస్టీ జీడిపప్పు పచ్చడి రెడీ. పచ్చడిలో నీరు పోయకుండా కారం పొడిగా తీసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుని ఎప్పుడు పచ్చడి కావాలన్నా కూడా ఈ పొడిని నీటిలో కలిపి వాడుకోవచ్చు. ఈ జీడిపప్పు పచ్చడి.. అన్ని రకాల టిఫిన్ల లోకి, అన్నం, బిర్యానీలోకి కూడా కలుపుకుని తినవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు