- Telugu News Photo Gallery Vitamin K Deficiency: Symptoms of vitamin K deficiency and health problems that one shouldn't ignore
Vitamin K Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నెగ్లెక్ట్ చేయకండి.. విటమిన్ కే లోపం ఉందేమో చెక్ చేసుకోండి..
మనశరీరంలో ఉండే విటమిన్స్ లో ఒకటి.. విటమిన్ K. ఇది ఎముకల ఆరోగ్యానికి, రక్తస్రావం గడ్డకట్టడానికి మాత్రమే కాకుండా కాలేయ, సాధారణ ఎముక పనితీరుకు కూడా ముఖ్యమైనది. కనుక మీ శరీరంలో విటమిన్ కే లోపం ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. శరీరంలో విటమిన్ K లోపం వల్ల ఎముకలకు చిన్న గాయం తగిలినా దెబ్బతింటాయి. ఎముకలు విరిగిపోవచ్చు. అంతేకాదు విటమిన్ కె లోపం వలన బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది.
Surya Kala | Edited By: Ravi Kiran
Updated on: Aug 17, 2023 | 7:32 PM

విటమిన్ ఎ, బి, సి , డి వంటి విటమిన్ల తో పాటు కే కూడా మన శరీరానికి అవసరం. విటమిన్ K ప్రధానంగా రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయ రోగులు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

కే విటమిన్ పనితీరుని విశ్లేషించినట్లయితే.. విటమిన్ K1 రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. విటమిన్ K2 బలమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడుతుంది.. మొత్తం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే విటమిన్ K3 కూడా ఉంటుంది.

విటమిన్ K కూడా ఊపిరితిత్తుల పనితీరుతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల, విటమిన్ కె లోపం ఏర్పడినప్పుడు, ఎముకల ఆరోగ్యానికి తోడు ఆస్తమా, సిఓపిడి మొదలైన సమస్యలు వస్తాయి

శరీరంలో విటమిన్ K లోపం వల్ల ఎముకలకు చిన్న గాయం తగిలినా దెబ్బతింటాయి. ఎముకలు విరిగిపోవచ్చు. అంతేకాదు విటమిన్ కె లోపం వలన బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది.

గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడం లేదా చర్మంపై నీలిరంగు మచ్చలు కనిపించినట్లయితే మీ శరీరంలో విటమిన్ K లోపం ఉందని గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు అంతేకాదు గుండె వేగం కూడా అకస్మాత్తుగా పెరగవచ్చు. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండవచ్చు.

ఋతుస్రావం సమయంలో స్త్రీలకు పొత్తి కడుపులో నొప్పి రావడం చాలా సాధారణం. కానీ ఈ నొప్పి భరించలేనిది అయితే శరీరంలో విటమిన్ K లోపం ఎక్కువగా ఉందని అర్ధం చేసుకుని తగిన నివారణ చర్యలు చేపట్టాలి.

అంతేకాదు ముక్కులో అధిక రక్తస్రావం విటమిన్ కె లోపానికి సంకేతం.





























