Watch Video: వివాహ వేడుకలో విషాదం.. వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా చెలరేగిన మంటలు.. 100మంది మృతి..
మ్యారేజ్ హాలులో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువ జరిగిందని అన్నారు. ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, సిబ్బందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో చూసిన నెటిజన్లు సైతం తీవ్రంగా స్పందించారు.
వివాహ వేడుక వైభవంగా జరుగుతున్న వేళ.. ఆ హాలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. దాదాపు 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. వివాహ వేడుకలో జరిగిన విషాద సంఘటన ఉత్తర ఇరాక్‌లో జరిగినట్టుగా తెలిసింది. ఒక క్రైస్తవ వివాహ వేడుకలో అగ్నిప్రమాదం సంభవించింది. సెప్టెంబర్ 26న జరిగిన వివాహ వేడుకలో జరిగిన ప్రమాదంలో 100 మందికి పైగా మరణించగా, 150 మంది గాయపడిన క్షణాలు.. కెమెరాలో రికార్డయ్యాయి. కరాకోష్ దీనిని అల్-హమ్దానియా అని కూడా పిలువబడే గ్రామానికి సమీపంలో ఉన్న వివాహ వేదిక లోపలి భాగంలోని వీడియోలో మంటలు చెలరేగాయి. మంటలు సెకన్లలో వ్యాపించాయి.
వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో పెళ్లికి హాజరైన అతిథులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ జంట పైన ఉన్న భారీ ట్రస్ నుండి వేలాడుతున్న పువ్వులు మంటలకు ఇంధనంగా పనిచేశాయి. నిప్పులు నేలపై పడినప్పుడు ఉవ్వెన మంటలు పైకి లేచాయి. చాలా మంది మెయిన్ హాల్ ఖాళీ చేసి పరుగులు తీశారు. మరింత ఎగిసిపడ్డ మంటలతో భవనం పూర్తిగా కాలిపోయింది. క్షతగాత్రులను హుటాహుటినా సమీప ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన వారి మృతదేహలు ఆ ప్రాంతమంతా భయనకంగా పడిఉన్నాయి.
ఘటనానంతరం ఫుటేజీలో భవనానికి జరిగిన తీవ్ర విధ్వంసం కనిపించింది. ప్రజలు అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం పారిపోతున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. చివరకు ఆ భవనంలో కాలిపోయిన మెటల్ శిధిలాలు మాత్రమే కనిపించాయి. అధికంగా మండే, తక్కువ ఖర్చుతో కూడిన నిర్మాణ సామగ్రిని ఉపయోగించడం వల్ల హాల్‌లో మంటలు వ్యాపించాయని పోలీసులు నిర్ధారించారు.
మ్యారేజ్ హాలులో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువ జరిగిందని అన్నారు. ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, సిబ్బందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో చూసిన నెటిజన్లు సైతం తీవ్రంగా స్పందించారు. జరిగిన ప్రమాదంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెళ్లి వేడుకలో ఇంతటి ఘోరం జరగటం పట్ల అందరూ అసహనం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..