AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లోరిడా స్విమ్మింగ్ పూల్‌లో హైదరాబాద్ డెలివరీ ఏజెంట్ అనుమానాస్పద మృతి.. కుటుంబీకుల విచారణ..

ఫ్లోరిడా పోలీసులు అతని మృతదేహాన్ని చూసేందుకు కూడా తమ కుటుంబ సభ్యులను అనుమతించడం లేదని వారు ఆరోపించారు. తాహెరా బాను, ముస్తఫా సోదరుడు ముస్తఫా మృతదేహం తేలుతున్న స్విమ్మింగ్ పూల్‌ ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడ సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. అంతేకాదు,

ఫ్లోరిడా స్విమ్మింగ్ పూల్‌లో హైదరాబాద్ డెలివరీ ఏజెంట్ అనుమానాస్పద మృతి.. కుటుంబీకుల విచారణ..
Hyderabad Delivery Man
Jyothi Gadda
|

Updated on: Oct 04, 2023 | 8:10 AM

Share

అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు స్విమ్మింగ్ పూల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్లోరిడాలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న మహ్మద్ ముస్తఫా షరీఫ్, డెలివరీ తర్వాత అక్కడి స్విమ్మింగ్‌ఫూల్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. హైదరాబాద్‌కు చెందిన 31 ఏళ్ల మహమ్మద్ ముస్తఫా షరీఫ్ అక్టోబర్ 2న పార్శిల్ డెలివరీ చేసేందుకు వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్‌సిఐ బాలాపూర్‌లో నివాసముంటున్న అతని కుటుంబ సభ్యులు అతని మరణవార్త తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. మహమ్మాద్‌ ముస్తఫా మరణం వెనుక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. షరీఫ్‌కు భార్య తాహెరా బాను, ఇద్దరు పిల్లలు రెండేళ్ల మహమ్మద్ షెజాద్, ఐదు నెలల మహ్మద్ హంజా ఉన్నారు.

డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న షరీఫ్‌.. ఒక పార్టీలో పార్శిల్ డెలివరీ చేయడానికి వెళ్ళాడు. ఒక గంట తర్వాత అతని మృతదేహం పార్టీ ప్రాంతానికి సమీపంలోని స్విమ్మింగ్ పూల్‌లో తేలుతూ కనిపించింది అని ముస్తఫా సోదరుడు మహ్మద్ నవాజ్ షరీఫ్ చెప్పారు.

డిసెంబరు 2022 మధ్యలో డిపెండెంట్ వీసాపై ముస్తఫా ఫ్లోరిడాకు వెళ్లాడు. అతని భార్య తాహెరా బాను US పౌరురాలు. అప్పటి నుంచి తను అక్కడే డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఫ్లోరిడా పోలీసులు అతని మృతదేహాన్ని చూసేందుకు కూడా తమ కుటుంబ సభ్యులను అనుమతించడం లేదని వారు ఆరోపించారు. తాహెరా బాను, ముస్తఫా సోదరుడు ముస్తఫా మృతదేహం తేలుతున్న స్విమ్మింగ్ పూల్‌ ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడ సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. అంతేకాదు, పూల్‌పడి చనిపోతే.. శరీరం నీళల్లో పైకి తేలడానికి కనీసం మూడు నుండి నాలుగు గంటలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే,.. స్థానికులు, పార్శిల్ సర్వీస్ ఇంఛార్జ్ ప్రకారం, ముస్తఫా మృతదేహం 50 నిమిషాలు తేలుతూ కనిపించింది. అతను పార్శిల్‌ను డెలివరీ చేసిన తర్వాత అక్కడ ఫౌల్ ప్లే జరిగిందని, అక్కడి పోలీసులు కుటుంబ సభ్యుల నుండి వాస్తవాలను దాచిపెడుతున్నారని మృతుడి సోదరుడు నవాజ్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా,.. AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మృతుడి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఏం జరిగిందో తెలుసుకుంటానని, తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. షరీఫ్‌ను చివరిసారిగా చూసేందుకు తల్లిదండ్రులకు అత్యవసర వీసా ఇప్పించాలని వారు కోరారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..