Chocolate: త్వరలో చనిపోతావంటూ జాతకం చెప్పి.. చాక్లెట్‌తో హత్య చేసిన వృద్ధురాలు!

జిల్‌లోని మాసియో నగరంలో నివాసముంటున్న ఫెర్నాండా వాలోజ్ పింటో (27) అనే మహిళ తన కూతురితో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. దారిలోజాతకం చెబుతానంటూ ఓ వృద్ధ మహిళ ఆమెను ఆపింది. జాతకం చెప్పించుకోవాలంటూ వృద్ధురాలు పింటోను కోరింది. దీంతో పింటో తన చేతిని వృద్ధురాలికి అందించింది. చేతి చూసిన ఆమె 'ఇంకొన్ని రోజుల్లో నువ్వు చనిపోతావని' చెప్పింది. అనంతరం పింటోకు ఓ చాక్లెట్‌ బహుమతిగా..

Chocolate: త్వరలో చనిపోతావంటూ జాతకం చెప్పి.. చాక్లెట్‌తో హత్య చేసిన వృద్ధురాలు!
Woman Dies After Eating Chocolate
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 03, 2023 | 7:32 PM

బ్రెజిల్‌, అక్టోబర్‌ 3: అపరిచితులు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తే తీసుకోకూడదంటూ చిన్న పిల్లలకు చెబుతుంటాం కానీ ఒక్కోసారి పెద్దలు కూడా ఈ విషయాన్ని పెడచెవిన పెట్టి కష్టాలు కొనితెచ్చుకుంటుంటారు. తాజాగా ఓ మహిళ గుర్తు తెలియని ఓ జ్యోతిష్కురాలు ఇచ్చిన చాక్లెట్‌ తిని ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

బ్రెజిల్‌లోని మాసియో నగరంలో నివాసముంటున్న ఫెర్నాండా వాలోజ్ పింటో (27) అనే మహిళ తన కూతురితో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. దారిలోజాతకం చెబుతానంటూ ఓ వృద్ధ మహిళ ఆమెను ఆపింది. జాతకం చెప్పించుకోవాలంటూ వృద్ధురాలు పింటోను కోరింది. దీంతో పింటో తన చేతిని వృద్ధురాలికి అందించింది. చేతి చూసిన ఆమె ‘ఇంకొన్ని రోజుల్లో నువ్వు చనిపోతావని’ చెప్పింది. అనంతరం పింటోకు ఓ చాక్లెట్‌ బహుమతిగా ఇచ్చింది.

జ్యోతిష్కురాలు ఇచ్చిన చాక్లెట్‌ను ఏమీ ఆలోచించకుండా పింటో తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం సదరు మహిళ ఇచ్చిన చాక్లెట్‌ను పింటో తినింది. చాక్లెట్‌ తిన్న గంటల వ్యవధిలోనే తీవ్ర అస్వస్థతకు గురైంది. తన కళ్లు మసక బారుతున్నట్లు, ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు, నోరంతా చేదుగా అయిపోయినట్లు పింటో తన సోదరి బియాంకా క్రిస్టినాకు ఫోన్‌లో చెప్పింది. ఓ వృద్ధ మహిళ ఇచ్చిన చాక్లెట్‌ను తిన్న తర్వాత అనారోగ్యం బారీన పడ్డట్లు పింటో తన ఫోన్‌ ద్వారా సోదరికి మెసేజ్‌ పంపింది. దీంతో హుటాహుటీన ఆమె బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి

అయితే అక్కడ చికిత్స పొందుతూ పింటో మృతి చెందింది. ముక్కు నుంచి రక్తం వచ్చి, నోటి నుంచి నురుగ వచ్చి ఆమె మృతి చెందింది. ఈ ఘటన గత ఏడాడి ఆగస్టు 4వ తేదీన చోటు చేసుకుంది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పురుగుల మందులో ఉపయోగించే రెండు రకాల రసాయనాలు (sulfotep and terbufos) మృతదేహంలో గుర్తించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ రెండు రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని, పింటోను ఎవరో ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

వీటిని వ్యవసాయం, పశుసంపద మంత్రిత్వ శాఖ వీటిని ఎప్పుడో నిషేధించింది. పింటోపై విషప్రయోగం చేయడానికి ఈ రసాయనాలను వినియోగించినట్లు.. కెమిస్ట్రీ అండ్‌ టాక్సికాలజీ లాబొరేటరీ హెడ్ థాల్మన్నీ గౌలర్ట్ పేర్కొన్నారు. అయితే నిజంగానే చాక్లెట్ తినడం వల్లనే ఆమె మరణించిందా అనే విషయం నిర్ధారించబడలేదు. పింటోను హతమార్చేందుకు ఎవరైనా జ్యోతిష్కురాలిని నియమించారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జ్యోతిష్కురాలి కోసం గాలింపులు చేపట్టారు.

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.