Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..

Gold and Silver Latest Prices: గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. పది గ్రాముల బంగారం ధర రూ.60 వేల మార్క్‌ను దాటి రికార్డు స్థాయికి కూడా చేరుకుంది. అయితే, ప్రస్తుతం పసిడి ధర మాత్రం అమాంతం తగ్గుతూ వస్తోంది. ఇటీవల కాలంలో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
Latest Gold Silver Prices
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 04, 2023 | 6:31 AM

Gold and Silver Latest Prices: గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. పది గ్రాముల బంగారం ధర రూ.60 వేల మార్క్‌ను దాటి రికార్డు స్థాయికి కూడా చేరుకుంది. అయితే, ప్రస్తుతం పసిడి ధర మాత్రం అమాంతం తగ్గుతూ వస్తోంది. ఇటీవల కాలంలో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోనే బంగారం ధరలో భారీ మార్పులు వస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారంపై రూ.660 మేర ధర తగ్గగా.. వెండిపై రూ.2000 మేర ధర తగ్గింది. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380 గా ఉంది. కాగా.. వెండి కిలో ధర రూ.71,000 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.57,530 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600, 24 క్యారెట్ల ధర రూ.57,380, కోల్‌కతాలో 22 క్యారెట్లు రూ.56,600, 24 క్యారెట్ల ధర రూ.57,380గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.52,900, 24 క్యారెట్ల ధర రూ.57,710గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,600, 24 క్యారెట్ల ధర రూ.57,380, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,600, 24 క్యారెట్లు రూ.57,380గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,600 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.57,380 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.71,000 గా ఉంది. ముంబైలో వెండి ధర రూ.71,000, చెన్నైలో రూ.73,500, బెంగళూరులో రూ.69,000, కేరళలో రూ.73,500, కోల్‌కతాలో రూ.71,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.73,500, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.73,500 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా