తలకెక్కిన వెర్రి అంటే ఇదే.. బైక్ రేసింగ్ మానుకోవాలని సూచన
దిశా ఎన్‌కౌంటర్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు సజ్జనార్ ఐపిఎస్.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించటంతో పాటు.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇటీవల సమస్యలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్‌పై ఆయన సైబరాబాద్ సీపీగా ఉన్నప్పటి నుండి నేటి వరకు పోరాడుతూనే ఉన్నారు.
దిశా ఎన్‌కౌంటర్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు సజ్జనార్ ఐపిఎస్.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించటంతో పాటు.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇటీవల సమస్యలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్‌పై ఆయన సైబరాబాద్ సీపీగా ఉన్నప్పటి నుండి నేటి వరకు పోరాడుతూనే ఉన్నారు. ఇక తాజాగా మరో ఘటనపై స్పందించారు సజ్జనార్.. సిటీ చివర్లో జరుగుతున్న బైక్ రేసింగ్‌లపై తనదైన రీతిలో పోస్ట్ పెట్టారు. వీకెండ్ వచ్చిందంటే చాలు.. నగర శివారులోని కొన్ని ప్రాంతాల్లో యధేచ్ఛగా బైక్ రేసింగ్ జరుగుతూనే ఉంది.. బైక్ రేసింగ్ చేస్తూ.. యువకులు వారు చేసిన విన్యాసాలను వీడియోల రూపంలో చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలను ఉదహరిస్తూ ఐపీఎస్ సజ్జనార్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.. తలకెక్కిన వెర్రి అంటే ఇదేనంటూ పోస్ట్ పెట్టారు. రేసింగ్‌లో భాగంగా ఒక యువకుడు ఏకంగా బైక్‌పై నిలబడి విన్యాసాలు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మకు వందేళ్ల వందనం.. ఒకే వేదికపై ఆరు తరాలు
పురిట్లోనే బిడ్డ మృతి.. అంతలోనే తల్లి కూడా
MS Dhoni: కొత్త లుక్ లో అదరగొట్టిన మహేందర్ సింగ్ ధోనీ