మాల్‌లో ఫ్రిడ్జ్‌ డోర్‌ తెరిచి.. ప్రాణం కోల్పోయిన చిన్నారి

మాల్‌లో ఫ్రిడ్జ్‌ డోర్‌ తెరిచి.. ప్రాణం కోల్పోయిన చిన్నారి

Phani CH

|

Updated on: Oct 04, 2023 | 9:54 AM

తండ్రితో కలిసి సరదాగా షాపింగ్ మాల్​కు వెళ్లిన ఓ చిన్నారి అనుకోని ప్రమాదం బారిన పడి మృతి చెందింది. ఐస్​క్రీమ్ కోసం ఫ్రిజ్ తలుపు తెరుద్దామని.. ఫ్రిజ్​ను ముట్టుకోగానే విద్యూదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలింది. తన కూతుర్ని కాపాడుకుందామని నాలుగైదు ఆస్పత్రులు తిరిగిన ఆ తండ్రికి చివరకు విగతజీవిగా మారిన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఎదురైంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్​లో సోమవారం రోజున చోటుచేసుకుంది.

తండ్రితో కలిసి సరదాగా షాపింగ్ మాల్​కు వెళ్లిన ఓ చిన్నారి అనుకోని ప్రమాదం బారిన పడి మృతి చెందింది. ఐస్​క్రీమ్ కోసం ఫ్రిజ్ తలుపు తెరుద్దామని.. ఫ్రిజ్​ను ముట్టుకోగానే విద్యూదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలింది. తన కూతుర్ని కాపాడుకుందామని నాలుగైదు ఆస్పత్రులు తిరిగిన ఆ తండ్రికి చివరకు విగతజీవిగా మారిన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఎదురైంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్​లో సోమవారం రోజున చోటుచేసుకుంది. ఎస్సై రాహుల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌ నియోజకవర్గం నవీపేటకు చెందిన గూడురు రాజశేఖర్‌ ఆదివారం తన కుటుంబంతో కలిసి నందిపేట్‌లోని అత్తారింటికి వెళ్లారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి ఊరికెళ్తుండగా.. నాలుగేళ్ల కుమార్తె రిషిత ఐస్‌క్రీం కావాలని కోరింది. నందిపేట్‌లోని ఎన్‌మార్ట్‌ మాల్‌కు తీసుకెళ్లారు. తండ్రి ఒక ఫ్రిజ్‌లో వస్తువులు చూస్తుండగా.. పక్కనున్న మరో ఫ్రిజ్‌ను తెరిచేందుకు రిషిత దాని డోర్‌ను ముట్టుకోగానే.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే బిగుసుకుపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సచివాలయంలో గంజాయి మొక్క కలకలం !!

బాబోయ్ ఎంతపెద్ద తిమింగలమో !! కేరళ తీరంలో టెన్షన్

అన్నదానంలో 32 వంటకాలు.. తిన్న వారికి తిన్నంత

Black Magic: నగ్నంగా గోదావరి ఒడ్డుపై తాంత్రిక పూజలు చేస్తుండగా ??

Boney Kapoor: ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త