బాబోయ్ ఎంతపెద్ద తిమింగలమో !! కేరళ తీరంలో టెన్షన్

కేరళలోని కోజికోడ్ తీరానికి ఓ బ్లూ వేల్ కొట్టుకొచ్చింది. చనిపోయి నీలి తిమింగళం కళేబరాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దాదాపు 50 అడుగులు పొడవున్న తిమింగళాన్ని చూసి షాక్ అవుతున్నారు. స్థానిక జాలర్ల ఇచ్చిన సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న అధికారులు తిమింగళం కళేబరాన్ని పరిశీలించారు. దాని మరణానికి కారణం తెలుసుకునేందుకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ప్రొటోకాల్ ప్రకారం దానిని అక్కడే పెద్దగొయ్యి పాతిపెడతామని అధికారులు తెలిపారు.

బాబోయ్ ఎంతపెద్ద తిమింగలమో !! కేరళ తీరంలో టెన్షన్

|

Updated on: Oct 04, 2023 | 9:46 AM

కేరళలోని కోజికోడ్ తీరానికి ఓ బ్లూ వేల్ కొట్టుకొచ్చింది. చనిపోయి నీలి తిమింగళం కళేబరాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దాదాపు 50 అడుగులు పొడవున్న తిమింగళాన్ని చూసి షాక్ అవుతున్నారు. స్థానిక జాలర్ల ఇచ్చిన సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న అధికారులు తిమింగళం కళేబరాన్ని పరిశీలించారు. దాని మరణానికి కారణం తెలుసుకునేందుకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ప్రొటోకాల్ ప్రకారం దానిని అక్కడే పెద్దగొయ్యి పాతిపెడతామని అధికారులు తెలిపారు. తీరానికి కొట్టుకొచ్చిన బ్లూ వేల్ కళేబరానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దానిని చూసేందుకు జనం పోటెత్తారు. అయితే ఎవరూ ఆ కళేబరం వద్దకు వెళ్లొద్దని, అది పేలిపోయి గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. సాధారణంగా పెద్ద తిమింగలాల కళేబరాల్లో వాయువులు ఏర్పడి ఒక్కోసారి పేలిపోతుంటాయి. అవి కొన్నిసార్లు నెమ్మదిగా విడుదలవుతాయి. మరికొన్ని సందర్భాల్లో మాత్రం భారీ పేలుడుతో బయటకు వచ్చేస్తాయి. గతంలో ఇలాంటి ఘటలు చాలానే జరిగాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అన్నదానంలో 32 వంటకాలు.. తిన్న వారికి తిన్నంత

Black Magic: నగ్నంగా గోదావరి ఒడ్డుపై తాంత్రిక పూజలు చేస్తుండగా ??

Boney Kapoor: ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త

రైతు కష్టం తీర్చిన స్టూడెంట్ !! పేటెంట్ పొంది రికార్డ్ !!

Follow us