అన్నదానంలో 32 వంటకాలు.. తిన్న వారికి తిన్నంత
అన్నం పరబ్రహ్మ స్వరూపం మాత్రమే కాదు... అది మనిషి జిహ్వ చాపల్యం. ఆకలితో ఉన్న వారు రుచి గురించి ఆలోచించకుండా తినేస్తారు. అందుకే భోజనాలు పెట్టడం, ఆహుతులు సంతృప్తిగా తినేలా రకరకాల పదార్థాలు వడ్డించే విధానం పూర్వం నుంచి వచ్చింది . ఇటీవల కాలంలో విందు భోజనాలు చాలా ఆర్బాటంగా ఉంటున్నాయి. ఇక ఈసారి వినాయకచవితి సందర్బంగా ఏర్పాటు చేసిన అన్నదానం మరి ప్రత్యేకంగా మారింది. మొత్తం 32 రకాల వంటకాలను వడ్డించి ఘనంగా అన్నదానం నిర్వహించారు గ్రామస్తులు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం మాత్రమే కాదు… అది మనిషి జిహ్వ చాపల్యం. ఆకలితో ఉన్న వారు రుచి గురించి ఆలోచించకుండా తినేస్తారు. అందుకే భోజనాలు పెట్టడం, ఆహుతులు సంతృప్తిగా తినేలా రకరకాల పదార్థాలు వడ్డించే విధానం పూర్వం నుంచి వచ్చింది . ఇటీవల కాలంలో విందు భోజనాలు చాలా ఆర్బాటంగా ఉంటున్నాయి. ఇక ఈసారి వినాయకచవితి సందర్బంగా ఏర్పాటు చేసిన అన్నదానం మరి ప్రత్యేకంగా మారింది. మొత్తం 32 రకాల వంటకాలను వడ్డించి ఘనంగా అన్నదానం నిర్వహించారు గ్రామస్తులు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అన్నదానం ఏర్పాటు చేశారు గ్రామస్తులు. ఏకంగా 32 రకాల వంటకాలతో అన్నదానం చేశారు. బూరెలు, చెక్కర పొంగలి, జాంగ్రీ, బజ్జీ, సమోసా , పులావ్, పులిహోర, అప్పడం, ఇలా ఎనిమిది రకాల స్వీట్స్, ఐదు రకాల హాట్స్ , కూరలు, పచ్చళ్ళు, పండ్లు, ఐస్ క్రీమ్ తో కలిపి మొత్తం 32 రకాలు వడ్డించారు. తినలేని వాళ్ళు తీసుకుని వెళ్ళేందుకు కవర్లు అందించారు. సుమారు నాలుగు వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఘనంగా అన్నదానం చేయడం ఆనందంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Black Magic: నగ్నంగా గోదావరి ఒడ్డుపై తాంత్రిక పూజలు చేస్తుండగా ??
Boney Kapoor: ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

