రైతు కష్టం తీర్చిన స్టూడెంట్ !! పేటెంట్ పొంది రికార్డ్ !!
రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్యాడి ఫిల్లింగ్ మిషన్ ను తయారు చేసి పేటెంట్ హక్కును పొందాడు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన విద్యార్థి మల్లారం అభిషేక్ రూపొందించిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ హక్కు జారీ చేసింది. అద్భుత ఆవిష్కరణ చేసిన అభిషేక్ ను జిల్లా కలెక్టర్ తోపాటు గైడ్ టీచర్ వెంకటేష్, ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఇప్పటికే అభిషేక్ రూపొందించిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ కు రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక బహుమతులు వచ్చాయి.
రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్యాడి ఫిల్లింగ్ మిషన్ ను తయారు చేసి పేటెంట్ హక్కును పొందాడు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన విద్యార్థి మల్లారం అభిషేక్ రూపొందించిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ హక్కు జారీ చేసింది. అద్భుత ఆవిష్కరణ చేసిన అభిషేక్ ను జిల్లా కలెక్టర్ తోపాటు గైడ్ టీచర్ వెంకటేష్, ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఇప్పటికే అభిషేక్ రూపొందించిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ కు రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక బహుమతులు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు అభిషేక్. జపాన్ లోని జరిగే అంతర్జాతీయ సదస్సుకు కూడా ఎంపికయ్యాడు అభిషేక్. హన్మాజిపేటకు చెందిన మర్రిపల్లి లక్ష్మీరాజం-రాజవ్వ దంపతుల కుమారుడు అభిషేక్. 2019లో హన్మాజీపేట జడ్పీహెచ్‌ఎస్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఇన్‌స్పైర్ పోటీల్లో భాగంగా ధాన్యాన్ని సులభంగా సంచుల్లో నింపేందుకు ప్యాడీ ఫిల్లింగ్ యంత్రాన్ని రూపొందించాడు. ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయవచ్చు. ఇప్పటికే ఈ ఆవిష్కరణకు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు వచ్చాయి. ఈ యంత్రానికి అభిషేక్ తండ్రి లక్ష్మిరాజం పేరుపై పేటెంట్ హక్కులు కల్పిస్తూ ఇటీవల భారత ప్రభుత్వం పేటెంట్ హక్కు జారీ చేయడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని అభిషేక్ తెలిపాడు…
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూమ్మీద నూకలు ఉన్నాయి.. రైలు కింద పడ్డా సేఫ్..
నల్లుల దెబ్బకు ఫ్రాన్స్ విల.. విల..
‘నీలి సూర్యుడు’ కనిపించి అలరించాడు..
నేను ప్లే చేస్తా.. మీరు పే చెయ్యండి.. కళాకారుడి తెలివికి నెటిజన్ల ప్రశంసలు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

