నల్లుల దెబ్బకు ఫ్రాన్స్ విల.. విల..
పర్యాటక దేశం ఫ్రాన్స్.. నల్లుల భయంతో వణికిపోతుంది. రాజధాని పారిస్‌ను నల్లులు నలిపేస్తున్నాయి. బస్సులు, సినిమా హాళ్లు ఎక్కడ చూసినా నల్లుల బెడదే. నల్లుల వల్ల నగర ప్రజలు సతమతమవుతున్నారని పారిస్ డిప్యూటీ మేయర్ తెలిపారు. వచ్చే ఏడాది ఒలింపిక్ క్రీడల నిర్వహణకు పారిస్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. నల్లుల నివారణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పారిస్‌లో ఇటీవలి కాలంలో నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.
పర్యాటక దేశం ఫ్రాన్స్.. నల్లుల భయంతో వణికిపోతుంది. రాజధాని పారిస్‌ను నల్లులు నలిపేస్తున్నాయి. బస్సులు, సినిమా హాళ్లు ఎక్కడ చూసినా నల్లుల బెడదే. నల్లుల వల్ల నగర ప్రజలు సతమతమవుతున్నారని పారిస్ డిప్యూటీ మేయర్ తెలిపారు. వచ్చే ఏడాది ఒలింపిక్ క్రీడల నిర్వహణకు పారిస్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. నల్లుల నివారణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పారిస్‌లో ఇటీవలి కాలంలో నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. జనానికి నరకం చూపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోజూ 36 లక్షల మంది ప్రజలు పారిస్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో నల్లుల ఉద్ధృతి పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.. మూడేళ్ల క్రితమే ఫ్రాన్స్ ప్రభుత్వం నల్లులపై యుద్ధాన్ని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్, అత్యవసర నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. అనేక ప్రణాళికలు అమలు చేసింది. అయితే పురుగు మందులను కూడా తట్టుకుని నల్లులు పుట్లకొద్దీ పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ సమస్యతో ఒలింపిక్ క్రీడలకు ఎటువంటి ముప్పు లేదని డిప్యూటీ మేయర్ గ్రెగోయిర్ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నీలి సూర్యుడు’ కనిపించి అలరించాడు..
నేను ప్లే చేస్తా.. మీరు పే చెయ్యండి.. కళాకారుడి తెలివికి నెటిజన్ల ప్రశంసలు
యూట్యూబర్స్‌కి హెచ్చరిక.. వ్యూస్ కోసం అలాచేస్తే అంతే
మొసలిని కుక్కలా పెంచుతున్న వ్యక్తి !! నోట్లో చేయిపెట్టినా కొరకదట
TSRTC: టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తప్పనున్న చిల్లర తిప్పలు